- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డాలర్ పతనం.. షాకిచ్చిన బంగారం, వెండి ధరలు
అమెరికా - ఇరాన్ శాంతి ఒప్పందం ప్రభావం బంగారం ధరలపై పడింది. సోమవారం మార్కెట్లు ప్రారంభం కావడంతోనే క్రూడాయిల్ ధరలు తగ్గగా.. రూపాయి విలువ పెరిగి, డాలర్ పతనమయింది.

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా - ఇరాన్ శాంతి ఒప్పందం ప్రభావం బంగారం ధరలపై పడింది. సోమవారం మార్కెట్లు ప్రారంభం కావడంతోనే క్రూడాయిల్ ధరలు తగ్గగా.. రూపాయి విలువ పెరిగి, డాలర్ పతనమయింది. దీంతో బంగారం, వెండి ధరలకు రెక్కలొచ్చాయి. గతవారంలో శుక్ర, శనివారాలు భారీగా పెరిగిన బంగారం ధరలు.. సోమవారం కూడా కొనుగోలు దారులకు షాకిచ్చాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.2450 పెరిగి రూ.1,51,530కి చేరింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.2250 పెరిగి రూ.1,38,900కి ఎకబాకింది. పెరిగిన ధరలకు జీఎస్టీ, మేకింగ్ ఛార్జీలు అదనంగా ఉంటాయి. గడిచిన మూడు రోజుల్లో ఆదివారం మినహా.. బంగారం ధరలు భారీగా పెరిగాయి. రూ.5400 నుంచి రూ.5840 వరకూ ధరలు పెరిగాయి. బంగారంతో పాటు వెండి ధర సైతం భారీగా పెరిగింది. కిలో వెండిపై రూ.10,000 పెరిగి.. ప్రస్తుత ధర రూ.2,80,000 గా ఉంది. మేకింగ్ ఛార్జీలు, జీఎస్టీ కలిపి రూ.3,23,000 వరకూ పలుకుతోంది.
ప్రధాని మోడీ బంగారం కొనవద్దని చెప్పాక.. అమాంతం పెరిగిన ధరలు.. ఒకానొక దశలో వరుసగా తగ్గుతూ వచ్చాయి. మళ్లీ ఇప్పుడు శాంతిఒప్పందం నేపథ్యంలో ధరలు పెరుగుతున్నాయి. దీంతో బంగారం, వెండి ఆభరణాలు, వస్తువులు కొనుగోలు చేసేవారు అయోమయంలో పడుతున్నారు. ఈ లోహాల ధరలు ఎప్పుడూ స్థిరంగా ఉండవన్న సంగతి తెలిసిందే. అయితే.. ఏ సమయంలో తగ్గుతాయి? ఏ సమయంలో పెరుగుతాయన్నదీ అంచనా వేయడం కష్టంగా మారింది.






