- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలుగు మేకర్స్‌కు షాక్ ఇచ్చిన ‘టాక్సిక్’.. ఈ ట్విస్ట్ ఎక్స్‌పెక్ట్ చేసి ఉండరు
‘టాక్సిక్’ చిత్రాన్ని సంక్రాంతి బరిలో నిలపాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: యాష్ హీరోగా, కియారా అద్వానీ హీరోయిన్‌గా, గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘టాక్సిక్’. ఈ సినిమా విడుదల తేదీ విషయంలో గత కొన్ని రోజులుగా అనేక వార్తలు వైరల్ అవుతున్నాయి. దీనికి ప్రధాన కారణం ఈ సినిమాను మొదట మార్చిలో విడుదల చేయనున్నట్లు ప్రకటించడమే. అందుకు అనుగుణంగా ప్రమోషన్లు నిర్వహించడంతో పాటు థియేటర్ హక్కులను కూడా విక్రయించారు. దీంతో ఈ సినిమా కచ్చితంగా మార్చిలో విడుదల అవుతుందని చాలామంది భావించారు. అయితే అనూహ్యంగా ఈ సినిమా వాయిదా పడింది.
అనంతరం జూన్ నెలలో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని వార్తలు వినిపించాయి. కానీ జూన్ రేస్ నుంచి కూడా ఈ మూవీ తప్పుకోవడంతో అసలు ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందనే విషయంపై స్పష్టత లేకుండా పోయింది. దీంతో విడుదల తేదీపై అనేక రూమర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఈ సినిమా విడుదల తేదీపై మరో వార్త వైరల్‌గా మారింది. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నిలపాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. అదే జరిగితే సంక్రాంతి రేస్‌లో ఉండే కొన్ని తెలుగు సినిమాలకు ప్రభావం పడే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీనికి కారణం ‘టాక్సిక్’ భారీ బడ్జెట్ సినిమా కావడంతో తెలుగు రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున విడుదల చేయాలని ప్లాన్ చేసే అవకాశం ఉంది.
అలా జరిగితే ఈ సినిమాకు ఎక్కువ సంఖ్యలో థియేటర్లు కేటాయించబడే అవకాశముంది. దాంతో తెలుగు సినిమాలకు థియేటర్ల కొరత ఏర్పడే పరిస్థితి రావచ్చు. మరోవైపు సంక్రాంతి సీజన్‌లో తెలుగు ప్రేక్షకులు ఎక్కువగా మన తెలుగు సినిమాలకే ప్రాధాన్యం ఇస్తారని తెలిసిందే. దీంతో ‘టాక్సిక్’కు థియేటర్లు దొరికినా, ఆశించిన స్థాయిలో కలెక్షన్లు తెలుగు రాష్ట్రాల్లో రాకపోవచ్చని, అది సినిమాపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి ఈ సినిమాను నిజంగానే సంక్రాంతి బరిలో నిలుపుతారా? లేక వేరే సమయంలో విడుదల చేస్తారా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.






