సీఎం విజయ్ విడాకుల కేసు.. చెంగల్‌పట్టు కోర్టు కీలక ఉత్తర్వులు

by Naga Rani Yarlagadda |

తమిళనాడు సీఎం విజయ్ - ఆయన భార్య సంగీత కొంతకాలంగా విడాకులు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. దీనిపై నేడు చెంగల్ పట్టు మహిళా కోర్టు విచారణ చేపట్టింది.

సీఎం విజయ్ విడాకుల కేసు.. చెంగల్‌పట్టు కోర్టు కీలక ఉత్తర్వులు
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు సీఎం విజయ్ - ఆయన భార్య సంగీత కొంతకాలంగా విడాకులు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. దీనిపై నేడు చెంగల్ పట్టు మహిళా కోర్టు విచారణ చేపట్టింది. ఈ విడాకుల కేసు విచారణను కోర్టు ఆగస్టు 7వ తేదీకి వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా.. సంగీత తన భర్త విజయ్ కు వేరే మహిళతో అక్రమ సంబంధం ఉందని ఈ ఏడాది ఫిబ్రవరిలో విడాకుల పిటిషన్ వేశారు. ఏప్రిల్ 20న విచారణకు ఇరువురు హాజరు కాకపోవడంతో జూన్ 15న ఇద్దరూ విచారణకు రావాలని చెంగల్పట్టు ఫ్యామిలీకోర్టు ఆదేశించింది.

పిటిషన్‌లో సంగీత సంచలన ఆరోపణలు

ఒక మహిళా నటితో విజయ్‌కు వివాహేతర సంబంధం ఉందని, ఈ విషయాన్ని తాను 2021లో కనిపెట్టానని సంగీత తన పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై విజయ్‌ను నిలదీయగా.. ఆ సంబంధాన్ని ముగించేస్తానని పలుమార్లు హామీ ఇచ్చారని తెలిపారు. కానీ, విజయ్ ఆ బంధాన్ని కొనసాగించడమే కాకుండా, సదరు నటితో కలిసి విహారయాత్రలకు, పలు కార్యక్రమాలకు వెళ్లారని ఆరోపించారు.

Next Story