విలువైన ప్రభుత్వ భూమి కబ్జా?

by Jakkula.Mamatha |

విలువైన ప్రభుత్వ భూమి కబ్జా అవుతున్న రెవెన్యూ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

విలువైన ప్రభుత్వ  భూమి కబ్జా?
X

దిశ, అబ్దుల్లాపూర్‌మెట్: విలువైన ప్రభుత్వ భూమి కబ్జా అవుతున్న రెవెన్యూ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాల్లో కబ్జాదారులు అక్రమంగా భూ కబ్జాకు పాల్పడుతున్నారు. ఇది ఎక్కడో మారుమూల ప్రాంతం కూడా కాదు. నగర శివారు కుంట్లూరులో భూ కబ్జా జరుగుతుంది. అయినా రెవిన్యూ అధికారులకు కనిపించడం లేదా అనే విమర్శలు వినిపిస్తున్నాయి. కబ్జాదారులతో కొమ్ము కస్తూన్నారు అనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం కుంట్లూరు రెవెన్యూ సర్వే నెంబర్. 24లో మొత్తం 84 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది.

గత కొంత కాలంగా సదర్ ప్రభుత్వ భూమి కబ్జా కొరలోకి వెళ్లింది. మిగిలిన కొంత భాగం భూమిలో రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూమిగా సూచిక బోర్డు ఏర్పాటు చేశారు. అది కూడా రాత్రికి రాత్రి బోర్డులను తొలగించి యథేచ్చగా కబ్జాలకు పాల్పడుతున్నారు. లాయల మోడల్ స్కూల్ సమీపంలో కూడా ప్రభుత్వ భూమి కలదు. కానీ ఇటీవల కొంత మంది ప్రభుత్వ బోర్డులు తొలగించి అక్రమంగా చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణాన్ని చేస్తున్నారు. గ్రామ నడిబొడ్డులో ప్రధాన రహదారి పక్కన విలువైన ప్రభుత్వ భూమి కబ్జాకు గురవుతుంది. రెవెన్యూ అధికారుల్లో మాత్రం చలనం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకొని ప్రభుత్వ భూమిని కాపాడాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

Next Story