- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉద్యాన పంటల సబ్సిడీలకు దరఖాస్తుల ఆహ్వానం
ఉద్యానవన శాఖ వివిధ సబ్సిడీ పథకాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు గజ్వేల్ డివిజన్ ఉద్యాన శాఖ అధికారి సౌమ్య తెలిపారు.

దిశ,వర్గల్: 2026-27 ఆర్థిక సంవత్సరానికి గజ్వేల్, వర్గల్, ములుగు, జగదేవ్‌పూర్, మర్కుక్ మండలాల రైతుల కోసం ఉద్యానవన శాఖ వివిధ సబ్సిడీ పథకాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు గజ్వేల్ డివిజన్ ఉద్యాన శాఖ అధికారి సౌమ్య తెలిపారు. మల్చింగ్ కోసం 100 ఎకరాలకు సబ్సిడీ అందుబాటులో ఉందన్నారు. కూరగాయల సాగు చేసే రైతులకు ఎకరాకు రూ.8 వేల సబ్సిడీ, కొత్తగా కూరగాయల పందిరి ఏర్పాటు చేసే వారికి అర ఎకరానికి రూ.50 వేల సబ్సిడీ లభిస్తుందని చెప్పారు.
స్టేకింగ్ విధానంలో కూరగాయలు సాగు చేసే రైతులకు 80 ఎకరాల మేర సబ్సిడీ అందుబాటులో ఉందన్నారు. అదేవిధంగా జామ, మామిడి తదితర పండ్ల తోటల ఏర్పాటుకు, టమాటా, వంకాయ, మిర్చి, క్యాబేజీ, కాలీఫ్లవర్ నారుకు, డ్రిప్ సేద్యానికి కూడా సబ్సిడీలు అందజేస్తామని పేర్కొన్నారు. ఆసక్తి గల రైతులు దరఖాస్తు ఫారం, పట్టాదారు పాస్‌పుస్తకం, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలు, పాస్‌పోర్ట్ సైజు ఫోటోతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 89777 14433, 93920 79101 నెంబర్లు సంప్రదించాలని తెలిపారు.






