- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహిళా కమిషన్ చైర్‌పర్సన్ గద్వాల విజయలక్ష్మి సోదరి మిస్సింగ్
తెలంగాణ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ గద్వాల విజయలక్ష్మి సోదరి అదృశ్యం. ముగ్గురిపై అనుమానం వ్యక్తం చేస్తూ బంజారాహిల్స్‌లో ఫిర్యాదు!

దిశ, వెబ్ డెస్క్: ఇంటి నుంచి బయటకు వెళ్లిన తన సోదరి కనిపించడం లేదంటూ తెలంగాణ మహిళా కమిషన్ చైర్ పర్సన్, మాజీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పోలీసులను ఆశ్రయించారు. వివరాల్లోకి వెళితే.. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని కమాన్ పరిసరాల్లో నివసించే విజయలక్ష్మి సోదరి కె.నమ్రత (57) ఈ నెల 4వ తేదీన ఉదయం 10 గంటల సమయంలో ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లారు. అయితే, రోజుల గడుస్తున్నా ఆమె తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన గద్వాల విజయలక్ష్మి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో అధికారికంగా ఫిర్యాదు చేశారు.
తన సోదరి అదృశ్యం వెనుక సతీష్ (35), సత్యనారాయణ (45), కుమారి (45) అనే ముగ్గురు వ్యక్తుల ప్రమేయం ఉండవచ్చని, వారిపై తనకు బలమైన అనుమానాలు ఉన్నాయని విజయలక్ష్మి తన ఫిర్యాదులో ప్రత్యేకంగా పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఆమె ఫిర్యాదు ఆధారంగా బంజారాహిల్స్ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అనుమానితులుగా పేర్కొన్న ముగ్గురు వ్యక్తుల వివరాలను సేకరించడం తో పాటు, ఆ ప్రాంతంలోని సీసీటీవీ (CCTV) ఫుటేజీలను పరిశీలిస్తూ నమ్రత ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు సమాచారం అందుతుంది.






