పాఠశాలలపై అమావాస్య ప్రభావం.. బడిబాట పట్టని విద్యార్థులు

by Jakkula.Mamatha |   (  Updated:2026-06-15 06:18:37  IST  )

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు పునఃప్రారంభమైనప్పటికీ, మొదటిరోజు విద్యార్థుల హాజరు శాతం ఆశించిన స్థాయిలో నమోదు కాలేదు.

పాఠశాలలపై అమావాస్య ప్రభావం.. బడిబాట పట్టని విద్యార్థులు
X

దిశ,రంగారెడ్డి: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు పునఃప్రారంభమైనప్పటికీ, మొదటిరోజు విద్యార్థుల హాజరు శాతం ఆశించిన స్థాయిలో నమోదు కాలేదు. తీవ్ర ఎండల కారణంగా పాఠశాలలకు ప్రారంభాన్ని మూడు రోజులు ఆలస్యంగా ఈ నెల 15 నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పాఠశాలలు తెరుచుకున్న మొదటి రోజే అమావాస్య కావడంతో ఆమనగల్లు పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో విద్యార్థుల హాజరు శాతం అంతంత మాత్రంగానే ఉంది.

అమావాస్య రోజు పిల్లలను కొత్త కార్యక్రమాలకు మంచిది కాదని నమ్మకంతో పలువురు తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలకు పంపించలేదని ఉపాధ్యాయులు చెబుతున్నారు. వారం రోజుల్లో విద్యార్థుల హాజరు శాతం క్రమంగా పెరుగుతుందని ఉపాధ్యాయులు, ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలు భావిస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు హాజరు కాకపోవడంతో ఉపాధ్యాయులు ఖాళీగా కూర్చున్నారు. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు తమ ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు ఫోన్ చేయాలని సూచించడంతో ఫోను చేయడంలో నిమగ్నమయ్యారు.

Next Story