సెన్సార్ పూర్తి చేసుకున్న ‘కాక్‌టెయిల్-2’.. రన్‌టైమ్ ఎంతంటే?

by Mallepaka Hamsa |   (  Updated:2026-06-15 07:00:50  IST  )

చిత్రంలోని కంటెంట్‌ను పరిశీలించిన సెన్సార్ బోర్డు సభ్యులు ఈ సినిమాకు ‘ఏ’ సర్టిఫికెట్‌ను జారీ చేశారు.

సెన్సార్ పూర్తి చేసుకున్న ‘కాక్‌టెయిల్-2’.. రన్‌టైమ్ ఎంతంటే?
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్, రష్మిక మందన్న, కృతి సనన్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘కాక్‌టెయిల్-2’. హోమీ అదజానియా దర్శకత్వంలో రాబోతుండగా.. బ్లాక్ బస్టర్ హిట్ ‘కాక్‌టెయిల్‌’కు సీక్వెల్‌గా రాబోతుండటంతో ప్రేక్షకుల్లో భారీ హైప్ క్రియేట్ అయింది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్ 19న థియేటర్స్‌లోకి రాబోతోంది. ఇప్పటికే ‘కాక్‌టెయిల్-2’ మంచి బజ్ క్రియేట్ కాగా.. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో, తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. చిత్రంలోని కంటెంట్‌ను పరిశీలించిన సెన్సార్ బోర్డు సభ్యులు ఈ సినిమాకు ‘ఏ’ సర్టిఫికెట్‌ను జారీ చేశారు. అంటే ఈ చిత్రాన్ని కేవలం 18 ఏళ్ల పైబడిన వారు మాత్రమే థియేటర్లలో చూసేందుకు అనుమతి ఉంటుంది. ఇక ఈ సినిమా రన్‌టైమ్ విషయానికొస్తే.. 2 గంటల 30 నిమిషాల నిడివితో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ చిత్రానికి ‘ఏ’ సర్టిఫికెట్ రావడం వెనుక ఒక ఆసక్తికరమైన రికార్డ్ ఉంది. నటి రష్మిక మందన్నకు బాలీవుడ్ ఇండస్ట్రీలో ‘యానిమల్’ సినిమా తర్వాత ఇది రెండో ‘ఏ’ సర్టిఫికెట్ మూవీ కావడం విశేషం. అలాగే హీరో షాహిద్ కపూర్‌ కెరీర్‌లో ఇది ఐదో ‘ఏ’ రేటెడ్ చిత్రం. ఇక మరో హీరోయిన్ కృతి సనన్‌కు మాత్రం ఆమె 12 ఏళ్ల సినీ కెరీర్‌లో ‘ఏ’ సర్టిఫికెట్ అందుకున్న మొదటి ప్రాజెక్ట్ ఇదే కావడం గమనార్హం.

Next Story