రోడ్డెక్కిన మహిళలు.. ఖాళీ బిందెలతో నిరసన

by Jakkula.Mamatha |

తాగునీటి కోసం మహిళలు రోడ్డెక్కారు.

రోడ్డెక్కిన మహిళలు.. ఖాళీ బిందెలతో నిరసన
X

దిశ, తంగళ్లపల్లి: తాగునీటి కోసం మహిళలు రోడ్డెక్కారు. ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం కేసీఆర్ నగర్‌లో గత మూడు రోజులుగా తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మహిళలు కాలనీ గేట్‌కు తాళం వేసి, ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. తాగునీరు, పారిశుద్ధ్య, వీధి దీపాల సమస్యలతో విసిగిపోయామని వాపోయారు. తమ సమస్యలను అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కేసీఆర్ నగర్ అనే పేరు ఉన్నందుకే తమ కాలనీని నిర్లక్ష్యం చేస్తున్నారా.. అంటూ ప్రభుత్వం పై మండిపడ్డారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కాలనీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని మహిళలను డిమాండ్ చేశారు. మహిళల ఆందోళనతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

Next Story