ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అల్పాహార పథకం ప్రారంభం

by Jakkula.Mamatha |   (  Updated:2026-06-15 07:03:22  IST  )

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన అల్పాహార పథకాన్ని మద్దూరు, కొత్తపల్లి(భూనీడు) ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో సోమవారం ఉదయం ప్రారంభించారు.

ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అల్పాహార పథకం ప్రారంభం
X

దిశ, మద్దూరు/కొత్తపల్లి: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన అల్పాహార పథకాన్ని మద్దూరు, కొత్తపల్లి(భూనీడు) ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో సోమవారం ఉదయం ప్రారంభించారు. అల్పాహార పథకంలో భాగంగా విద్యార్థులకు వారంలో దోస మరియు చట్నీ, రెండు మిల్లెట్(చిరుధాన్యాల) ఇడ్లీలు మరియు సాంబార్, రెండు పూరీలు మరియు వెజిటబుల్ కుర్మా, రెండు బోండాలు మరియు చట్నీ లేదా సాంబార్, రెండు సాధారణ ఇడ్లీలు మరియు చట్నీ లేదా సాంబార్, ఉప్మా మరియు చట్నీ లేదా సాంబార్ అందించడంతోపాటు మూడు రోజులు పాలు/రాగి జావ ఈ వేడి పాలు మిగిలిన మూడు రోజులు రాగి జావను అందిస్తారన్నారు.

ఈ కార్యక్రమంలో మద్దూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ నజ్‌హత్ నాదీమ్ , కొత్తపల్లి జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రసన్న రాణి, మద్దూరు మున్సిపల్ చైర్‌పర్సన్ సరస్వతి జనార్ధన్ మరియు కళాశాల అధ్యాపకులు రాములు, రాజేష్, శ్రీను రెడ్డి, లక్ష్మి రెడ్డి, రమేష్, సంతు నాయక్, రాజశేఖర్, పూర్ణిమ, అమర్నాథ్, గోపాల్, మధుసూదన్ రెడ్డి, భాస్కర్, తిరుపతయ్య, సంజీవ్ మల్లేష్, హేమలత, రాణి తదితరులు పాల్గొన్నారు.

Next Story