- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బైక్‌ను ఢీకొన్న లారీ.. వ్యక్తి దుర్మరణం
జహీరాబాద్-బీదర్ ప్రధాన రహదారిపై సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

దిశ,జహీరాబాద్: జహీరాబాద్-బీదర్ ప్రధాన రహదారిపై సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన లారీ, బైక్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తి తీవ్రంగా గాయపడి, సంఘటనా స్థలంలోనే దుర్మరణం పాలయ్యారు. కాగా సంఘటన, మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రోడ్డు పై ఏర్పడిన ప్రమాదకరమైన గుంతల కారణంగా జహీరాబాద్-బీదర్ రోడ్డుపై ప్రయాణిస్తున్న బైక్‌ను ఎదురుగా వచ్చిన లారీ అదుపుతప్పి ఢీకొట్టింది. ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉండటంతో సదరు వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్ట్‌మార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు ఎవరు? ఎక్కడి నుంచి వస్తున్నాడు? అనే వివరాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.






