- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మాస్ కాంబో సెట్.. రవితేజతో ‘సింగం’ దర్శకుడు?
రవితేజ–హరి కాంబినేషన్‌లో ఓ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం ‘ఇరుముడి’ అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాను ఆగస్టు 21వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఇక ప్రస్తుతం రవితేజ కోసం మరో మాస్ దర్శకుడు రంగం సిద్ధం చేస్తున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తమిళ సినీ పరిశ్రమలో సూపర్ క్రేజ్ కలిగిన మాస్ దర్శకుల్లో ఒకరైన హరి తాజాగా రవితేజకు ఒక కథ వినిపించినట్లు తెలుస్తోంది. ఆ కథ రవితేజకు బాగా నచ్చడంతో, ఆయన ఈ దర్శకుడితో పనిచేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
అన్ని అనుకున్నట్లుగా జరిగితే మరికొన్ని రోజుల్లోనే ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. హరి దర్శకత్వంలో రూపొందిన ‘సింగం’ సిరీస్ చిత్రాలు తెలుగులో కూడా అద్భుతమైన విజయాలను సాధించిన విషయం తెలిసిందే. దీంతో ఈ దర్శకుడికి తెలుగు ప్రేక్షకుల్లోనూ మంచి గుర్తింపు ఉంది. అందువల్ల రవితేజ – హరి కాంబినేషన్‌లో ఒక హై వోల్టేజ్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ వస్తే, దానిపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.






