విషాదం.. రిటైర్డ్ ఉపాధ్యాయుడి కుటుంబం ఆత్మహత్య

by Naga Rani Yarlagadda |

విషాదం.. రిటైర్డ్ ఉపాధ్యాయుడి కుటుంబం ఆత్మహత్య
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో విషాద ఘటన జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. సంగం మండలం దువ్వూరుకు చెందిన దంపతులు మధుసూదన్ రావు, రత్నవేణి, కుమారుడు సాయి షుక్రుతో తో కలిసి నివాసం ఉంటున్నారు. మధుసూదన్ రావు రిటైర్డ్ టీచర్. విషయం తెలుసుకున్న స్థానికులు, బంధువులు పోలీసులకు సమాచారమివ్వగా ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టమ్ కు తరలించారు. స్పాట్ లో దొరికిన సూసైడ్ నోట్ ఆధారంగా వారిది ఆత్మహత్యలని పోలీసులు భావిస్తున్నారు. కానీ.. ముగ్గురి చేతులు కట్టేసి ఉండటంతో ఆత్మహత్యలా ? కాదా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాలే వారి సూసైడ్ కు కారణమని సూసైడ్ నోట్ లో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. కాగా.. దంపతులకు పిల్లలు లేకపోవడంతో సాయిషుక్రు అనే యువకుడిని చిన్నప్పుడే అనాధాశ్రమం నుంచి దత్తత తీసుకుని పెంచుకున్నట్లు సమాచారం. అయితే దంపతులతో పాటు యువకుడి మానసిక పరిస్థితి ఏమాత్రం బాలేదని సమాచారం.

Next Story