చున్నీని సైడ్ చేసి హాట్ అందాలతో రెచ్చిపోయిన మానస చౌదరి

by Pulgam srinivas |   (  Updated:2026-06-15 06:07:47  IST  )

అదిరిపోయే యాంగిల్స్‌లో మానస చౌదరి పోజులు.. సోషల్ మీడియా షేక్.

చున్నీని సైడ్ చేసి హాట్ అందాలతో రెచ్చిపోయిన మానస చౌదరి
X

దిశ, వెబ్ డెస్క్: యంగ్ బ్యూటీ మానస చౌదరి ‘బబుల్‌గమ్’ సినిమాతో సినీ రంగంలోకి అడుగుపెట్టింది. ఆ సినిమా భారీ విజయాన్ని అందుకోకపోయినా, అందులో తన స్క్రీన్ ప్రెజెన్స్‌, గ్లామర్‌తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది.

తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ ఆ తర్వాత పలు తెలుగు చిత్రాల్లో అవకాశాలు అందుకుంది. ఇటీవల ‘గాయపడ్డ సింహం’ మూవీలో కూడా కనిపించి ప్రేక్షకులను మెప్పించింది.

ఇక సినిమాల్లోనే కాదు సోషల్ మీడియాలో కూడా మానస తన గ్లామర్‌తో ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన కొన్ని స్టన్నింగ్ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

రంగురంగుల డిజైన్‌తో ఉన్న స్టైలిష్ స్లీవ్‌లెస్ డ్రెస్‌లో మెరిసిపోయిన మానస, ట్రెండీ లుక్‌తో అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంది. స్టైలిష్ అవుట్‌ఫిట్‌కు మ్యాచ్ అయ్యేలా భారీ ఇయర్‌రింగ్స్ ధరించి, డిఫరెంట్ యాంగిల్స్‌లో ఇచ్చిన పోజులు ఫోటోలకు మరింత ఆకర్షణను తీసుకొచ్చాయి.

హెయిర్ స్టైలింగ్‌ను కూడా విభిన్నంగా ట్రై చేస్తూ, ప్రతి ఫ్రేమ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మొత్తంగా ఈ బ్యూటీ లేటెస్ట్ పిక్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.

Photos Courtesy: Instagram

Next Story