'డ్రాగన్'లో బాలీవుడ్ స్టార్ బ్యూటీ?

by Pulgam srinivas |

డ్రాగన్ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

డ్రాగన్లో బాలీవుడ్ స్టార్ బ్యూటీ?
X

దిశ, వెబ్ డెస్క్: జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ‘డ్రాగన్’ అనే పవర్‌ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా కనిపించనుండగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సినిమాలో రుక్మిణి వసంత్‌తో పాటు బాలీవుడ్ స్టార్ బ్యూటీ కృతి సనన్ కూడా కనిపించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఈమె పాత్ర నిడివి తక్కువగా ఉన్నప్పటికీ కథలో చాలా కీలకంగా ఉండబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కాబట్టి నిజంగానే కృతి సనన్ ఈ సినిమాలో నటిస్తుందా? లేదా? అనేది వేచి చూడాల్సిందే. ప్రస్తుతం ఈ చిత్రాన్ని 2027 జూన్ 11న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. అలాగే ఈ మూవీని రెండు భాగాలుగా తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నట్లు కూడా టాక్ వినిపిస్తోంది.

Next Story