భారీ వర్షాలకు నేలకూలిన విద్యుత్ స్తంభాలు

by Jakkula.Mamatha |

‘విద్యుత్ సార్లు కనికరించండి’ అని రైతులు వేడుకుంటున్న సంఘటన జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం కొత్త ధామరాజు పల్లి గ్రామంలో చోటు చేసుకుంది.

భారీ వర్షాలకు నేలకూలిన విద్యుత్ స్తంభాలు
X

దిశ, మల్లాపూర్: ‘విద్యుత్ సార్లు కనికరించండి’ అని రైతులు వేడుకుంటున్న సంఘటన జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం కొత్త ధామరాజు పల్లి గ్రామంలో చోటు చేసుకుంది. ఈ సందర్భంగా ఏలేటి లింగారెడ్డి మాట్లాడుతూ.. గ్రామంలో గత 20 రోజుల కిందట భారీ వర్షంతో పాటు గాలులు వీయడంతో సుమారుగా 50 విద్యుత్ స్తంభాలు విరిగి వ్యవసాయ విద్యుత్ కు అంతరాయం కలిగింది. కాగా విద్యుత్ అధికారులు వెంటనే పనులు ప్రారంభించి కొంతమేర విద్యుత్ సరఫరా చేస్తున్నప్పటికీ పూర్తిస్థాయిలో సరఫరా కావడం లేదని అన్నారు. అధికారులకు 20 రోజుల నుంచి విన్నవించుకున్న అధికారులు స్పందించడం లేదని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి విద్యుత్ సరఫరా జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు.

Next Story