ఏన్కూరు మండల కాంగ్రెస్ అధ్యక్షురాలిగా స్వర్ణ శిరీష నియామకం

by Jakkula.Mamatha |

ఏన్కూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా మండల పరిధిలోని జన్నారం గ్రామానికి చెందిన స్వర్ణ శిరీషను కాంగ్రెస్ అధిష్టానం నియామకం చేసింది.

ఏన్కూరు మండల కాంగ్రెస్ అధ్యక్షురాలిగా స్వర్ణ శిరీష నియామకం
X

దిశ, ఏన్కూర్: ఏన్కూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా మండల పరిధిలోని జన్నారం గ్రామానికి చెందిన స్వర్ణ శిరీషను కాంగ్రెస్ అధిష్టానం నియామకం చేసింది. గతంలో శిరీష భర్త స్వర్ణ నరేందర్ సుమారు 15 సంవత్సరాల నుండి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగారు. సాధారణంగా మహిళా కాంగ్రెస్ లో మహిళలకు ప్రాధాన్యత ఇచ్చే కాంగ్రెస్ పార్టీ ఏకంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా నియమించడం బహుశా చాలా అరుదు. శిరీష మామ స్వర్ణ రామారావు ఢిల్లీ రామయ్య పేరు ఉంది. ఆనాడు మంత్రి జలగం ప్రసాదరావు చేతుల మీదుగా ఏన్కూరు మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసిన సందర్భం కూడా ఉంది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం స్వర్ణ కుటుంబానికి మండల అధ్యక్షులు పదవి ఇచ్చి పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేయడంతో శిరీష నియామకం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తాను మండల కాంగ్రెస్ అధ్యక్షురాలుగా నియమితులు కావడానికి సహకరించిన వైరా ఎమ్మెల్యే మాలోత్ రామదాసు నాయక్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, నూతి సత్యనారాయణ గౌడ్ తో పాటు పలువురు ప్రజాప్రతినిధులకు శిరీష కృతజ్ఞతలు తెలిపారు.

Next Story