- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రియుడితో పెళ్లి రద్దు చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్.. చర్చనీయాంశంగా మారిన వ్యవహారం!
సునైనా, ఖలీద్‌ల పెళ్లి ఆగిపోయిందని, వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారని పలు వార్తలు ఇండస్ట్రీలో వైరల్ అవుతున్నాయి.

దిశ, సినిమా: సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీల పెళ్లిళ్లు, బ్రేకప్‌లు ఈ మధ్య కాలంలో సర్వసాధారణం అయిపోయాయి. కొందరు ప్రేమించి పెళ్లి చేసుకుని కొద్ది రోజులకే విడిపోతుంటే.. మరికొందరు ఎంగేజ్‌మెంట్ జరిగిన తర్వాత ఊహించని విధంగా పెళ్లిని రద్దు చేసుకుంటున్నారు. ఇటీవల నటి నివేదా పేతురాజ్ తన నిశ్చితార్థం తర్వాత దుబాయ్‌కి చెందిన రజత్ ఇబ్రాన్‌తో పెళ్లిని క్యాన్సిల్ చేసుకుని అందరికీ షాక్ ఇచ్చారు. ఇప్పుడు టాలీవుడ్ హీరోయిన్ సునైనా యెల్లా కూడా అదే బాటలో నడుస్తోందంటూ సోషల్ మీడియాలో పుకార్లు షికారు చేస్తున్నాయి. ‘టెన్త్ క్లాస్’, ‘రాజ రాజ చోర’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన సునైనా, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. గత ఏడాది శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘కుబేర’ సినిమాతో ఆమె తన ఖాతాలో బ్లాక్ బస్టర్ హిట్‌ను వేసుకున్నారు. అయితే, సునైనా వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే.. ఆమె దుబాయ్‌కి చెందిన ప్రముఖ యూట్యూబర్ ఖలీద్ అల్ అమెరితో ప్రేమాయణం సాగిస్తున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి.
ఆ వార్తలను నిజం చేస్తూ ఆమె ఖలీద్‌తో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి అందరికీ పెద్ద షాక్ ఇచ్చారు. కానీ, ఎంగేజ్‌మెంట్ తర్వాత వీరిద్దరూ పెళ్లి ఎప్పుడనే విషయంపై ఎక్కడా క్లారిటీ ఇవ్వలేదు. ఈ క్రమంలో, తాజాగా సునైనా, ఖలీద్‌ల పెళ్లి ఆగిపోయిందని, వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారని పలు వార్తలు ఇండస్ట్రీలో వైరల్ అవుతున్నాయి. సాధారణంగా సెలబ్రిటీలు విడిపోయే ముందు సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడం, పాత ఫొటోలను డిలీట్ చేయడం చేస్తుంటారు. ఇప్పుడు ఖలీద్, సునైనా కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్నట్లు టాక్. అంతేకాకుండా, ఖలీద్ తన అకౌంట్ నుండి సునైనాతో ఉన్న ఫొటోలను కూడా డిలీట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన సోషల్ మీడియాలో ‘‘ఆ రాత్రి ఎప్పటికీ గుర్తుంటుంది.. థాంక్యూ గాడ్’’ అని రాయడం ఇప్పుడు పలు అనుమానాలకు బలం చేకూరినట్లు అయింది. ఈ వ్యవహారం కాస్త సోషల్ మీడియాలో చర్చకు దారితీస్తోంది.






