ఒక్క రోజులో 40 ఇంటర్వ్యూలు.. సమంత మాస్ రికార్డు

by Pulgam srinivas |   (  Updated:2026-06-15 04:41:08  IST  )

‘మా ఇంటి బంగారం’ ప్రమోషన్లలో భాగంగా సమంత ఒకే రోజు ఏకంగా 40 వీడియో ఇంటర్వ్యూలు ఇచ్చి ఆల్‌టైమ్ రికార్డ్ సృష్టించినట్లు తెలుస్తోంది.

ఒక్క రోజులో 40 ఇంటర్వ్యూలు.. సమంత మాస్ రికార్డు
X

దిశ, వెబ్ డెస్క్: సినిమా ఇండస్ట్రీలో మూవీని ఎంత బాగా తీశామన్నదానికంటే, దానిని ఎంత బాగా ప్రమోట్ చేశామన్నదే ఈ రోజుల్లో కీలకంగా మారింది. ముఖ్యంగా ఓటీటీ ప్రాధాన్యం పెరిగిన తర్వాత ప్రేక్షకులు థియేటర్లకు రావడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదు. అయితే ప్రమోషన్ల ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకుంటే సినిమాను థియేటర్‌లో చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దాంతో మేకర్స్ భారీ స్థాయిలో ప్రమోషన్లు నిర్వహిస్తూ తమ సినిమా అద్భుతంగా ఉండబోతుందనే నమ్మకాన్ని ప్రేక్షకుల్లో కలిగించే ప్రయత్నం చేస్తున్నారు.

సినిమా పూర్తయ్యాక ప్రమోషన్లకు పెద్ద ఎత్తున సమయం కేటాయించడం కూడా ఇప్పుడు సాధారణంగా మారిపోయింది. ఒకప్పటితో పోలిస్తే హీరోలు, హీరోయిన్లు కూడా భారీగా ప్రమోషన్లలో పాల్గొంటున్నారు. ఇక తాజాగా ప్రమోషన్ల విషయంలో సమంత ఓ అద్భుతమైన రికార్డును సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ బ్యూటీ తాజాగా ‘మా ఇంటి బంగారం’ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించింది. నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను జూన్ 19వ తేదీన విడుదల చేయనున్నారు.

సినిమా విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో, నిన్న సమంత ఏకంగా 40 వీడియో ఇంటర్వ్యూలు ఇచ్చినట్లు సమాచారం. ఆ ఇంటర్వ్యూలు దాదాపుగా ఈరోజు, రేపు యూట్యూబ్‌లో అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఒకే రోజు 40 ఇంటర్వ్యూలు ఇవ్వడం మామూలు విషయం కాదని, ఇది ఓ ఆల్‌టైమ్ రికార్డుగా సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఏదేమైనా తాను నటించిన సినిమాను ప్రమోట్ చేసే విషయంలో సమంత ఈ స్థాయి డెడికేషన్ చూపించడం గొప్ప విషయమేనని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

‘మా ఇంటి బంగారం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ తేది, వేదిక ఫిక్స్

Next Story