‘మా ఇంటి బంగారం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ తేది, వేదిక ఫిక్స్

by Pulgam srinivas |

‘మా ఇంటి బంగారం’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఈరోజు హైదరాబాద్‌లోని ఐటీసీ కోహినూర్‌లో సాయంత్రం 6 గంటలకు నిర్వహించనున్నారు.

‘మా ఇంటి బంగారం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ తేది, వేదిక ఫిక్స్
X

దిశ, వెబ్ డెస్క్: స్టార్ హీరోయిన్ సమంత తాజాగా నటించిన చిత్రం ‘మా ఇంటి బంగారం’. ఈ సినిమాకు నందిని రెడ్డి దర్శకత్వం వహించారు. జూన్ 19వ తేదీన ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో మూవీ యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ తేదీ, వేదికను ఖరారు చేస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది. తాజాగా ఈ మూవీ టీమ్ ప్రీ రిలీజ్ సెలబ్రేషన్స్‌ను ఈరోజు అనగా జూన్ 15వ తేదీన హైదరాబాద్‌లోని ఐటీసీ కోహినూర్‌లో సాయంత్రం 6 గంటలకు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఈ సినిమాపై పర్వాలేదనే స్థాయిలో అంచనాలు ఉన్నాయి.

అయితే సినిమా విడుదల తర్వాత మంచి టాక్ వస్తే కలెక్షన్లు భారీగా వచ్చే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చాలా కాలం తర్వాత సమంత నటించిన సినిమా కావడంతో ఆమె అభిమానులు ఈ మూవీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ సినిమాతో సమంత ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. గుల్షన్ దేవయ్య, గౌతమి, దిగంత్, శ్రీముఖి కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని త్రలాల మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మాతలు రాజ్ నిడిమోరు, సమంత, హిమాంక్ రెడ్డి దువ్వూరు నిర్మించారు. సంతోష్ నారాయణన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

Next Story