కెరీర్‌పై కీలక నిర్ణయం తీసుకున్న జాన్వీ కపూర్.. ఇక అలాంటి పాత్రలకే ప్రాధాన్యం

by Pulgam srinivas |   (  Updated:2026-06-15 04:34:39  IST  )

ఇకపై సీరియస్, వైవిధ్యమైన పాత్రల్లో నటించడంపై జాన్వీ కపూర్ దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది.

కెరీర్‌పై కీలక నిర్ణయం తీసుకున్న జాన్వీ కపూర్.. ఇక అలాంటి పాత్రలకే ప్రాధాన్యం
X

దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. శ్రీదేవి - బోనీ కపూర్ కుమార్తె అయిన ఈ ముద్దుగుమ్మ చాలా కాలం క్రితమే సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఇప్పటికే అనేక చిత్రాల్లో నటించిన జాన్వీ, ఒకటి, రెండు సినిమాలను మినహాయిస్తే ఎక్కువగా గ్లామర్ పాత్రలతోనే ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇటీవలి కాలంలో ఈమె తెలుగులో కూడా వరుస సినిమాలు చేస్తోంది. కొంతకాలం క్రితం ‘దేవర పార్ట్ 1’ సినిమాలో మెరిసిన జాన్వీ, తాజాగా ‘పెద్ది’ చిత్రంలో కూడా నటించింది. అయితే ఈ రెండు సినిమాల్లోనూ ఆమె పాత్రలకు నటనకు పెద్దగా స్కోప్ లేకుండా, కేవలం గ్లామర్‌కే పరిమితమయ్యాయని విమర్శలు వినిపిస్తున్నాయి.

దాంతో జాన్వీ నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలపై ఆసక్తి చూపడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేవలం అందాలతోనే ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే విమర్శలను కూడా ఆమె ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో జాన్వీ తన కెరీర్‌లో కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇకపై గ్లామర్ పాత్రలు, కమర్షియల్ సినిమాలకు కాస్త విరామం ఇచ్చి, సీరియస్ మరియు వైవిధ్యమైన పాత్రల్లో నటించడంపై దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తన అందాలతో ప్రేక్షకులను పలుమార్లు కట్టిపడేసిన జాన్వీ, నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో కూడా మెరిస్తే ఆమెకు తిరుగే ఉండదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

సినిమాలు మానేయాలి అని డిసైడ్ అయ్యా - నివేదా పేతురాజ్

Next Story