గుండెపోటుతో ప్రభుత్వ ఉద్యోగి మృతి

by Jakkula.Mamatha |

గుండెపోటుతో ప్రభుత్వ ఉద్యోగి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది.

గుండెపోటుతో ప్రభుత్వ ఉద్యోగి మృతి
X

దిశ, ఉండవెల్లి: గుండెపోటుతో ప్రభుత్వ ఉద్యోగి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అలంపూర్ పట్టణానికి చెందిన బాలమ్మ కుమారుడు శ్రీకాంత్(45) ఉండవల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో టైపిస్టుగా విధులు నిర్వహిస్తున్నారు. శుక్రవారం విధులకు హాజరైన శ్రీకాంత్ శనివారం ఆదివారం సెలవు దినాలు కావడంతో గ్రామం అలంపూర్ లోనే ఉన్నాడు. ఆదివారం స్వల్ప గుండెపోటుకు గురికావడంతో కుటుంబ సభ్యులు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం రాత్రి 9 గంటలకు గుండెపోటుతో మృతి చెందినట్లు డాక్టర్లు ధృవీకరించారు. ఒక్కగానొక్క కొడుకు మృతి చెందడంతో తల్లి బాలమ్మ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతుడికి భార్య ఒక సంవత్సరం బాబు ఉన్నారు. తోటి ఉద్యోగి మృతి చెందడంతో తహసీల్దార్ కార్యాలయంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Next Story