కొనుగోలు కేంద్రంలో మొలకెత్తిన ధాన్యం

by Jakkula.Mamatha |

మండలంలోని వీపనగండ్ల కొనుగోలు కేంద్రంలో కురువ వెంకటయ్యకు చెందిన ధాన్యం మూడు రోజులుగా కురిసిన వర్షానికి తడిసి మొలకెత్తింది.

కొనుగోలు కేంద్రంలో మొలకెత్తిన ధాన్యం
X

దిశ, వీపనగండ్ల: మండలంలోని వీపనగండ్ల కొనుగోలు కేంద్రంలో కురువ వెంకటయ్యకు చెందిన ధాన్యం మూడు రోజులుగా కురిసిన వర్షానికి తడిసి మొలకెత్తింది. కొనుగోలు కేంద్రంలో రెండు నెలలుగా ధాన్యం నిల్వ చేసి విక్రయించుకోవడానికి నిరీక్షించాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యం, లారీల కొరత, మిల్లుల యజమానులు స్థలం లేదని సాకులు చెప్పడంతో ధాన్యం పేరుకు పోయి వర్షానికి తడవాల్సిన దుస్థితి నెలకొందని అన్నదాతలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో అధికారులు లారీలను పంపించి ధాన్యం తరలించాలని రైతులు వాపోతున్నారు.

Next Story