పెళ్లి రోజు నాడు మెగా ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చిన ఉపాసన.. వావ్, క్యూట్ అంటూ కామెంట్స్

by Mallepaka Hamsa |

ఉపాసన పెట్టిన పోస్ట్ చూసిన సెలబ్రిటీలు, నెటిజన్లు వావ్, క్యూట్ అంటూ లవ్ ఎమోజీలను షేర్ చేస్తున్నారు.

పెళ్లి రోజు నాడు మెగా ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చిన ఉపాసన.. వావ్, క్యూట్ అంటూ కామెంట్స్
X

దిశ, సినిమా: రామ్ చరణ్, ఉపాసనల పెళ్లి రోజు కావడంతో మెగా అభిమానులకు ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చారు. అయితే ఇటీవల తమకు పుట్టిన కవల పిల్లలకు సంబంధించిన ఫొటోలను ఎక్కడా షేర్ చేయలేదు. ఇక పెళ్లి రోజు కానుకగా.. ట్విన్స్ మొదటి గ్లింప్స్‌ను అభిమానులతో పంచుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక క్యూట్ ఫొటోను షేర్ చేసిన ఈ జంట.. తమ ముగ్గురు పిల్లల చేతులు కనిపిస్తున్న ఆ ఫొటోకు మనసు నిండిపోయింది అంటూ ఇన్ఫినిటీ ఎమోజీని జత చేశారు. ఈ పోస్ట్‌తో చరణ్, ఉపాసనల ముగ్గురు పిల్లలు.. అంటే పెద్ద కూతురు క్లిన్ కారా జూన్ 20, 2023న జన్మించగా.. కొత్తగా పుట్టిన కవలలు ఒకే ఫ్రేమ్‌లో మొదటిసారి ప్రపంచానికి కనిపించారు. ఈ కవల పిల్లలలో ఒక అబ్బాయి, ఒక అమ్మాయి ఉన్నారు. అబ్బాయికి శివరామ్ అని, అమ్మాయికి అన్వీరా దేవి అని నామకరణం చేసిన విషయం తెలిసిందే. అయితే ఉపాసన పెట్టిన పోస్ట్ చూసిన సెలబ్రిటీలు నెటిజన్లు వావ్, క్యూట్ అంటూ లవ్ ఎమోజీలను షేర్ చేస్తున్నారు. మొత్తానికి ఉపాసన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మెగా ఫ్యాన్స్ మాత్రం ముగ్గురి పిల్లల ముఖాలు రివీల్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నారు.

Next Story