- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అర్జున్ సర్జా ‘బ్లాస్ట్’ ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
‘బ్లాస్ట్’ సినిమా డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకోగా, జూన్ 26వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం.

X
దిశ, వెబ్ డెస్క్: సీనియర్ నటుడు, యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా తాజాగా ‘బ్లాస్ట్’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రీతి ముకుందన్, అభిరామి, జాన్ కొక్కెన్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సుభాష్ కె. రాజ్ దర్శకత్వం వహించారు. పెద్దగా అంచనాలు లేకుండా మే 28వ తేదీన థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, రిలీజ్ అనంతరం మంచి టాక్‌ను సొంతం చేసుకుని భారీ కలెక్షన్లను రాబట్టింది. బాక్సాఫీస్ దగ్గర ప్రేక్షకుల ఆదరణ పొందిన ఈ చిత్రం మరికొన్ని రోజుల్లో ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం, ఈ సినిమా డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సంస్థ సొంతం చేసుకుంది. అందులో భాగంగా ఈ చిత్రాన్ని జూన్ 26వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందించారు.
మహేష్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘ఒక్కడు’ రీ-రిలీజ్ డేట్ ఫిక్స్
Next Story






