- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నాగ్ అశ్విన్ ఫార్ములానే ఫాలో అవుతా.. అనిల్ రావిపూడి ఆసక్తికర వ్యాఖ్యలు
నాగి ట్రైలర్ లేకుండానే 'సింగ్ గీతం' సినిమాను బ్లాక్‌బస్టర్ చేశాడని, తాను అదే ఫార్ములా ఫాలో అవుతానంటూ అనిల్ రావిపూడి వ్యాఖ్యానించాడు.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన తాజా మ్యూజికల్ ఫాంటసీ చిత్రం ‘సింగ్ గీతం’. ఈ చిత్రంలో అయాన్, అహిల్య బమ్రూ, షాలిని కొండేపూడి ప్రధాన పాత్రలు పోషించగా, శివ నారాయణ, బెనర్జీ, తులసి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. వైజయంతి మూవీస్, స్వప్న సినిమా బ్యానర్లపై నాగ్ అశ్విన్, స్వప్న దత్, ప్రియాంక దత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. దేవిశ్రీప్రసాద్ కి చిత్రానికి సంగీతం అందించాడు. ఈ సినిమా జూన్ 12న విడుదలై మంచి టాక్‌ను సొంతం చేసుకుంది.
దీంతో ప్రస్తుతం ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను రాబడుతోంది. ఈ నేపథ్యంలో మూవీ బృందం నిన్న సాయంత్రం ‘గోల్డెన్ బ్లాక్‌బస్టర్’ పేరుతో ఓ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ ఈవెంట్‌లో భాగంగా అనిల్ రావిపూడి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఆయన మాట్లాడుతూ.. “‘సింగ్ గీతం’ సినిమా అద్భుతంగా ఉంది. ఈ వయసులో కూడా సింగీతం శ్రీనివాసరావు గారు ఇలాంటి కంటెంట్‌తో సినిమా తీయడం మామూలు విషయం కాదు.
మేమంతా ఎంతో కష్టపడి ట్రైలర్లు కట్ చేసి, సినిమాపై హైప్ పెంచేందుకు విడుదల చేస్తుంటాం. కానీ నాగ్ అశ్విన్ మాత్రం ఈ సినిమాకు ఎలాంటి ట్రైలర్ విడుదల చేయలేదు. కొన్ని మంచి మాటలతోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. ఇప్పుడు చూస్తే మూవీ బ్లాక్‌బస్టర్ అయింది. ఇక నేను కూడా ఇదే ఫార్ములాను ఫాలో అవుతా.. ట్రైలర్ విడుదల చేయను” అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. ఇలా అనిల్ రావిపూడి చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.






