- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహేష్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘ఒక్కడు’ రీ-రిలీజ్ డేట్ ఫిక్స్
‘ఒక్కడు’ చిత్రాన్ని జూన్ 26వ తేదీన రీ-రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

దిశ, వెబ్ డెస్క్: సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌లలో ఒకటిగా నిలిచిన చిత్రాల్లో ‘ఒక్కడు’ ఒకటి. భూమిక చావ్లా హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి గుణశేఖర్ దర్శకత్వం వహించగా, ప్రకాష్ రాజ్ ప్రతినాయకుడి పాత్రలో కనిపించారు. మణిశర్మ సంగీతం అందించిన ఈ సినిమాను సుమంత్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎం.ఎస్. రాజు నిర్మించారు. 2003 సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ సినిమా అప్పట్లో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ చిత్రాన్ని మళ్లీ రీ-రిలీజ్ చేయనున్నారు. తాజాగా దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది.
‘ఒక్కడు’ చిత్రాన్ని జూన్ 26వ తేదీన రీ-రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇప్పటికే మహేష్ బాబు నటించిన పలు సినిమాలు రీ-రిలీజ్‌లో భాగంగా మంచి వసూళ్లను రాబట్టాయి. మరి ‘ఒక్కడు’ సినిమా ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుందో చూడాలి. మహేష్ బాబు పుట్టినరోజు ఆగస్టు 9వ తేదీన అనే విషయం తెలిసిందే. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు నెలలో మహేష్ నటించిన పలు సినిమాలు రీ-రిలీజ్‌కు సిద్ధమవుతున్నాయి. అయితే, అంతకుముందే ‘ఒక్కడు’ రీ-రిలీజ్ కానుండడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నట్లు తెలుస్తోంది.






