న్యాయవాది ఇంటిపై దాడికి యత్నించిన ఎమ్మెల్యే చింతమనేని

by Malleboina Mahesh |

ఏలూరులో అర్ధరాత్రి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ హల్‌చల్ చేశారు.. పొక్లెయిన్లతో వెళ్లి న్యాయవాది శ్రీనివాసబాబు ఇంటిపై దాడికి యత్నించారు.

న్యాయవాది ఇంటిపై దాడికి యత్నించిన ఎమ్మెల్యే చింతమనేని
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ ఎమ్మెల్యే అర్థరాత్రి హల్ చల్ చేశారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ (MLA Chintamaneni Prabhakar) ప్రముఖ న్యాయవాది ఈడ్పుగంటి శ్రీనివాసబాబు నివాసమే లక్ష్యంగా ఆయన తన అనుచరులతో కలిసి దాడికి యత్నించడం స్థానికంగా కలకలం రేపింది. ఏకంగా పొక్లెయిన్లను (JCBs) వెంటబెట్టుకుని లాయర్ ఇంటి వద్దకు వెళ్లిన చింతమనేని.. ‘వాడో.. నేనో తేలిపోవాలి అంటూ తీవ్రస్థాయిలో బహిరంగంగానే బెదిరింపులకు దిగారు. ఇద్దరి మధ్య ఉన్న పాత విభేదాలే ఈ ఘర్షణకు దారి తీసినట్లు సమాచారం.

ఘటనా స్థలంలో ఉన్న న్యాయవాది కుటుంబ సభ్యులతో పాటు, సమాచారం అందుకుని అక్కడికి చేరుకున్న పోలీసులు ఎంత వారించినా, నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఎమ్మెల్యే అస్సలు వినకుండా తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి, అర్ధరాత్రి పొక్లెయిన్లతో న్యాయవాది ఇంటిపై దాడికి ప్రయత్నించడం ఏలూరు రాజకీయాల్లో తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఎమ్మెల్యే స్వయంగా వీధి రౌడీలా ప్రవర్తించడం పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాగా ఈ దాడికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఎమ్మెల్యే తీరుతో కూటమి ప్రభుత్వంపై వైసీపీ పార్టీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

Next Story