- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డీల్ చేసుకుంటే శత్రువులను నమ్మినట్లు కాదు - ఇరాన్
డీల్ చేసుకుంటే శత్రువులను నమ్మినట్లు కాదని యూఎస్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది ఇరాన్.

దిశ, వెబ్ డెస్క్: అమెరికా వర్సెస్ ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం జరిగింది. ఈ మేరకు రెండు దేశాలు అధికారిక ప్రకటన చేశాయి. అమెరికాతో యుద్ధాన్ని ముగించేందుకు ఒప్పందం కుదిరిందని తాజాగా ఇరాన్ డిప్యూటీ విదేశీ మంత్రి ఘరీబాబాది అధికారికంగా ప్రకటించారు. దీనిపై స్విట్జర్లాండ్ లో ఈ నెల 19వ తేదీన సంతకాలు జరుగుతాయని వెల్లడించారు. తుది ఒప్పందం కోసం 60 రోజుల పాటు చర్చలు కొనసాగుతాయన్నారు.
లెబనాన్ సహా ఇతర ప్రాంతాల్లో మిలిటరీ ఆపరేషన్ తక్షణమే నిలిచిపోతాయని వివరించారు ఘరీబాబాది. డీల్ చేసుకుంటే శత్రువులను నమ్మినట్టు కాదని అమెరికాకు ఝలక్ ఇచ్చారు. అమెరికా హామీలకు కట్టుబడి ఉంటుందో ? లేదో ? పర్యవేక్షిస్తామని వెల్లడించారు. ఇక ఆటు ట్రంప్ కూడా ఈ శాంతి ఒప్పందం పై కీలక వ్యాఖ్యలు చేశారు. హర్ముజ్ జలసంధి ఎలాంటి టోల్ లేకుండా ఓపెన్ అవుతుందని ప్రకటించారు. యూఎస్ నావిక దిగ్బంధనాన్ని తొలగించినట్లు స్పష్టం చేశారు. ఇక షిప్ ల ఇంజిన్లు స్టార్ట్ చేయండి...ఆయిల్ తరలించండి అంటూ ప్రకటన చేశారు.






