US-ఇరాన్ కుదిరిన ఒప్పందం.. తగ్గిన చమురు ధరలు

by velandi.Saikiran |

US-ఇరాన్ మ‌ధ్య‌ ఒప్పందం కుదిరిన నేప‌థ్యంలో చమురు ధరలు త‌గ్గాయి.

US-ఇరాన్ కుదిరిన ఒప్పందం.. తగ్గిన చమురు ధరలు
X

దిశ‌, వెబ్ డెస్క్‌: అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఈ నెల 19వ తేదీన స్విట్జర్లాండ్ లో రెండు దేశాలు శాంతి ఒప్పందంపై సంతకాలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ శాంతి ఒప్పందం కుదిరినట్లు ట్రంప్ మొదట అధికారికంగా ప్రకటించారు. ఈ క్రమంలోనే అంతర్జాతీయ మార్కెట్లో ఆయిల్ ధరలు అమాంతం తగ్గిపోయాయి. బ్రెంట్ క్రూడ్ 3.9% తగ్గిపోయి బ్యారెల్ ధర 84 డాలర్లకు చేరుకుంది. యూఎస్ క్రూడ్ 4.8% తగ్గి, బ్యారెల్ కు 81 డాలర్లు గా ట్రేడ్ అవుతోంది. ఫిబ్రవరి చివరలో యుద్ధం ప్రారంభానికి ముందు చమురుదరా బ్యారెల్ కు 70 డాలర్ల కంటే తక్కువ ఉండేదన్న సంగతి తెలిసిందే. ఆ స్థాయికి ధరలు చేరాలంటే, ఈ ఏడాది సెప్టెంబ‌ర్ మాసం వ‌ర‌కు ఆగాల్సిందేన‌ని ట్రేడ్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఇది ఇలా ఉండ‌గా, శాంతి ఒప్పందంపై ప్ర‌క‌ట‌న చేసిన ట్రంప్‌..హ‌ర్ముజ్ జ‌ల‌సంధి గుండా వెళ్లే నౌక‌ల‌కు ఎలాంటి ఫీజులు ఉండ‌బోవ‌ని ప్ర‌క‌టించారు.

Next Story