- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ద్రోణి ఎఫెక్ట్... ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు
by velandi.Saikiran |
పశ్చిమ మధ్యబంగాళాఖాతం, దక్షిణ కోస్తాంధ్ర నుంచి తమిళనాడు వరకు ద్రోణి విస్తరించి ఉందని అమరావతి వాతావరణ శాఖ పేర్కొంది.

X
దిశ, వెబ్ డెస్క్: ఏపీ వాసులకు బిగ్ అలర్ట్. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దక్షిణ కోస్తాంధ్ర నుంచి తమిళనాడు వరకు ద్రోణి విస్తరించి ఉందని అమరావతి వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావంతో నేడు మన్యం, అల్లూరి, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, నంద్యాల, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని హెచ్చరించింది. అలాగే శ్రీకాకుళం, పోలవరం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, గుంటూరు, బాపట్ల, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈదురు గాలులు, ఉరుములతో వర్షం పడే సమయంలో చెట్ల కింద, భారీ హోర్డింగ్స్ వద్ద నిలబడొద్దని సూచనలు చేసింది. అటు తెలంగాణ రాష్ట్రంలో కూడా పలు జిల్లాల్లో వర్షాలు పడనున్నట్లు సమాచారం.
Next Story






