కిలోమీటర్ దూరంలో ఉన్న అక్షరాలను కూడా చదవొచ్చు..! మరో సాంకేతిక అద్భుతం!!

by Javid Pasha |   (  Updated:2026-02-02 14:51:45  IST  )

చైనీస్ సైంటిస్టులు డెవలప్‌చేసిన సరికొత్త లేజర్ డివైజ్1 మిల్లీమీటర్ వెడల్పు గల లెటర్స్‌ను సైతం1.36 కిలోమీటర్ల దూరం నుంచి సులభంగా చదవగల సామర్థ్యాన్ని కలిగి ఉంది.

కిలోమీటర్ దూరంలో ఉన్న అక్షరాలను కూడా చదవొచ్చు..! మరో సాంకేతిక అద్భుతం!!
X

దిశ, ఫీచర్స్ : రంగు రంగుల కాంతి తరంగాలను ప్రసరింప జేసే లేజర్స్.. దాని సాంకేతికత గురించి మీకు తెలిసే ఉంటుంది. కానీ దూరాన ఉన్న అక్షరాలను సైతం క్షుణ్ణంగా చదవగలిగే సామర్థ్యంగల టెక్నాలజీ గురించి మీరెప్పుడైనా విన్నారా? ఇంతకాలమైతే లేదు. కానీ చైనాలోని యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ(USTC)కి చెందిన శాస్త్రవేత్తలు దీనిని అభివృద్ధి చేశారు. దీనిని ‘లేజర్ ఇంటెన్సిటీ ఇంటర్‌ఫెరోమెట్రీ డివైజ్’ అని పిలుస్తున్నారు. ఇంతకీ దీనిని ఎలా డెవలప్ చేశారు? దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

చైనీస్ సైంటిస్టులు డెవలప్‌చేసిన సరికొత్త లేజర్ డివైజ్1 మిల్లీమీటర్ వెడల్పు గల లెటర్స్‌ను సైతం1.36 కిలోమీటర్ల దూరం నుంచి సులభంగా చదవగల సామర్థ్యం కలిగి ఉంది. అంటే ఈ పరికరం లేజర్ బీమ్స్, స్కాటర్డ్ లైట్ అండ్ అల్గారిథమ్ సాయంతో ఆ చిన్న లెటర్స్‌ను గుర్తించి, ఇమేజ్‌గా రీకన్‌స్ట్రక్ట్ చేసి, దానిని ఉపయోగించే వారికి స్పష్టంగా చూపిస్తుంది. ఇది ల్యాబ్ కండిషన్స్‌లో మాత్రమే కాకుండా, బిజీ సిటీ ఎన్విరాన్‌మెంట్‌లో కూడా పనిచేస్తుంది. కాబట్టి సర్వైలెన్స్ అండ్ రిమోట్ సెన్సింగ్ రంగాలను మార్చివేసే అవకాశం ఉంది. ఇక దీని పనితీరు విషయానికి వస్తే ఈ డివైజ్ ‘యాక్టివ్ ఇంటెన్సిటీ ఇంటర్‌ఫెరోమెట్రీ’ అనే టెక్నిక్‌ను ఉపయోగిస్తుంది. ఇక్కడ సూపర్-క్లియర్ లెన్సెస్‌పై ఆధారపడకుండా, మల్టిపుల్ లేజర్ బీమ్స్‌ను ప్సూడోథర్మల్ ఇల్యూమినేషన్(Random flickering way)లో టార్గెట్‌పై ప్రకాశిస్తుంది. రెండు సెపరేట్ టెలిస్కోప్స్ స్కాటర్డ్ లైట్‌ను కలెక్ట్ చేసి, అధునాతన అల్గారిథమ్ ద్వారా ఇమేజ్‌ను రీకన్‌స్ట్రక్ట్ చేస్తుంది. దీంతో సింగిల్ టెలిస్కోప్ కంటే ఎక్కువ డీటెయిల్ పొందుతుంది.

ప్రయోజనాలు :

*శాస్త్రవేత్తలు డెవలప్ చేసిన ‘లేజర్ ఇంటెన్సిటీ ఇంటర్‌ఫెరోమెట్రీ డివైజ్’‌తో ఒక కిలోమీటర్‌కి పైగా దూరంలో కూడా మిల్లీమీటర్ స్కేల్ (1-3 mm) ఆబ్జెక్ట్స్ లేదా టెక్స్ట్‌ను స్పష్టంగా చదవడం/చూడటం సాధ్యమవుతుంది. సాధారణ టెలిస్కోప్ లేదా కెమెరాలకు ఇది అసాధ్యం.

*సర్వైలెన్స్ అండ్ సెక్యూరిటీ అప్లికేషన్స్ వల్ల దూరంలో ఉన్న టార్గెట్‌లను అంటే.. వ్యక్తులు, వాహనాలు, సైన్స్ బోర్డులు, లేదా డాక్యుమెంట్లను హై-రిజల్యూషన్‌తో మానిటర్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది స్పై ఆపరేషన్స్, బోర్డర్ సెక్యూరిటీ, క్రిమినల్ ఇన్వెస్టిగేషన్‌లలో విప్లవాత్మక మార్పు తీసుకురాగలదు.

*కిలోమీటర్ దూరంలోని చిన్న ఆబ్జెక్ట్స్‌ను(Space Debris, Satellite Parts) గుర్తించడం, వాటి డీటెయిల్స్ తెలుసుకోవడం సాధ్యమవుతుంది. పైగా ఇది స్పేస్ సేఫ్టీ అండ్ శాటిలైట్ ఆపరేషన్స్‌కు చాలా ఉపయోగకరం.

*దూరంలో ఉన్న పురాతన శిలాశాసనాలు, గుడిగోడలపై రాసిన టెక్స్ట్ లేదా డీటెయిల్డ్ కార్వింగ్స్‌ను దగ్గరకు వెళ్లకుండానే స్పష్టంగా చూడటం, డాక్యుమెంట్ చేయడం సాధ్యమవుతుంది. ఇది ఆర్కియాలజిస్టులకు సేఫ్ అండ్ ఎఫిషియెంట్ టూల్‌గా పనిచేస్తుంది. జంతువులను దూరం నుంచి గుర్తించడం, వాటి బిహేవియర్ లేదా ట్యాగ్‌లు/మార్కింగ్స్ చదవడం కూడా సులభం అవుతుంది.

*వాతావరణ పరిస్థితులను.. దూరపు ప్రాంతాలను గుర్తించడం, గమనించడం, అంచనా వేయడం, అధ్యయనం చేయడం సాధ్యం అవుతుంది. బిజీ సిటీ లేదా ఔట్‌డోర్ ఎన్విరాన్‌మెంట్‌లో కూడా పనిచేస్తుంది. అయితే ఇది ల్యాబ్ ప్రోటోటైప్ మాత్రమే. అంటే ఇంకా పరిశోధన దశలోనే ఉంది. సాధారణ ప్రజలు లేదా మార్కెట్లో కమర్షిల్‌గా అందుబాటులో లేదు. భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉందంటున్నారు శాస్త్రవేత్తలు.

నేచర్ ఒక నేచురల్ టెక్నాలజీ.. మనం ఏం నేర్చుకోవచ్చు..?

Next Story