- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేచర్ ఒక నేచురల్ టెక్నాలజీ.. మనం ఏం నేర్చుకోవచ్చు..?
ప్రకృతి అనేది మానవులు యంత్రాలను డిజైన్ చేయడానికి ముందు నుంచే, లక్షలాది సంవత్సరాలుగా సహజమైన రీఫైండ్ ఇంటెలిజెంట్ సిస్టమ్‌ను కలిగి ఉంది.

దిశ, ఫీచర్స్ : ఆధునిక సాంకేతికత వల్ల మానవులకు ఎన్నో సౌకర్యాలు అందుబాటులోకి వస్తున్నాయి. విప్లవాత్మకమైన మార్పునకు దారితీస్తున్నాయి. ఏఐ మొదలు కొని క్వాంటం టెక్నాలజీ వరకు శాస్త్రవేత్తలు ఎన్నో విషయాలను కనుగొన్నారు. అయితే వీటిని ఉపయోగించుకుంటూనే మనం ప్రకృతిని, వనరులను సైతం సంరక్షించుకోవాలి అంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. నేచర్ ఒక నేచురల్ టెక్నాలజీ. అది లేకపోతే మానవులకు మనుగడ లేదు. మోడ్రన్ టెక్నాలజీ అవసరం లేకుండానే.. ప్రకృతి సహజ సిద్ధమైన సాంకేతిక జ్ఞానాన్ని, వనరులను ఎలా క్రియేట్ చేసింది? దాని నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు? ఇప్పుడు తెలుసుకుందాం.
తామర ఆకులు, పువ్వులు
ప్రకృతి అనేది మానవులు యంత్రాలను డిజైన్ చేయడానికి ముందు నుంచే, లక్షలాది సంవత్సరాలుగా సహజమైన రీఫైండ్ ఇంటెలిజెంట్ సిస్టమ్‌ను(Refined Intelligent Systems) కలిగి ఉంది. దీని ద్వారా శక్తి, సామర్థ్యం, మనుగడకు సంబంధిత సమస్యలను పరిష్కరించే బయోమిమిక్రీని కలిగి ఉంది. ప్రకృతి నుంచి నేర్చుకోవడం ద్వారా పర్యావరణ అనుకూల ఉత్పత్తులు, వనరుల సృష్టికి దోహదపడుతుంది. ఉదాహరణకు తామర పువ్వులు(lotus leaves), ఆకులు సెల్ఫ్-క్లీనింగ్ మెకానిజమ్‌తో సూపర్‌హైడ్రోఫోబిక్ సర్ఫేసెస్‌ను ప్రేరణగా నిలుస్తాయి. దీంతో నీటి తుంపరలు లేదా బిందువులు మురికిని తొలగిస్తాయి.
కాక్టస్(ముళ్ల పొదలు) చెట్లు
బ్రహ్మ చెముడు వంటి ముళ్ల చెట్లు స్వతహాగా అద్భుతమైన వాటర్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను కలిగి ఉంటాయి. ఏడారుల్లో వాటర్ కలెక్షన్, స్టోరేజ్ టెక్నాలజీలను ఇవి ప్రేరేపిస్తాయి. అలాగే అలోవెరా రిసోర్సెస్ స్టోరేజ్.. జెల్ వంటి పదార్థాలకు ప్రేరణగా నిలుస్తుంది. మష్రూమ్స్ లివింగ్ నెట్‌వర్క్స్ (మైసీలియమ్) ద్వారా బయోడిగ్రేడబుల్ మెటీరియల్స్, అలాగే సస్టైనబుల్ లెదర్‌ను సృష్టిస్తాయి. ఇది ఫ్యాషన్ అండ్ మెటీరియల్ సైన్స్‌లో ఉపయోగపడుతుంది.
వెదురుతో వాటర్ ట్రీట్మెంట్
వెదురు చెట్లు శక్తి, ఫ్లెక్సిబిలిటీ అర్కిటెక్చర్ అండ్ మెటీరియల్స్‌లో లైట్‌వెయిట్ స్ట్రక్చర్స్‌కు స్ఫూర్తినిస్తాయి. ఇక మునగ చెట్లలోని వ్యవస్థలు ప్యూరిఫికేషన్ వాటర్ ట్రీట్‌మెంట్ టెక్నాలజీలను ప్రేరేపిస్తాయి. దీని విత్తనాలు నేచురల్ క్లీనర్స్‌గా పనిచేస్తాయి. ఆల్గే ఎనర్జీ ఫ్యాక్టరీలుగా ఫోటో సింథెసిస్ ద్వారా బయోఫ్యూయల్స్ అండ్ సోలార్ టెక్‌ను క్రియేట్ చేస్తాయి. సన్‌ఫ్లవర్స్ లైట్ ట్రాకింగ్ (Heliotropism) సోలార్ ప్యానెల్ ట్రాకర్స్‌ను ప్రేరేపిస్తాయి.
సమర్థవంతమైన వ్యవస్థలు
ప్రకృతి సిద్ధమైన ఈ సిస్టమ్స్ ఎనర్జీ, మెటీరియల్స్, అర్కిటెక్చర్ అండ్ సస్టైనబిలిటీలో మోడరన్ సొల్యూషన్లను ప్రేరేపిస్తాయి. స్మార్ట్ ఇన్నోవేషన్లు నేలకు సహకరించి బలమైన, శుభ్రమైన మరింత రెసిలియంట్‌గా మారతాయని నిరూపిస్తాయి. ఈ బయోమిమిక్రీ ద్వారా మనం ప్రకృతి నుంచి నేర్చుకుని పర్యావరణ అనుకూల సాంకేతికతను అర్థం చేసుకోవడం, అభివృద్ధి చేయడం చేయవచ్చు. ఇది వృథాను అరికట్టడం, తగ్గించడం, సమర్థవంతమైన వ్యవస్థలను క్రియేట్ చేయడం, పర్యావరణ అనుకూలతను, సమతుల్యతను ప్రోత్సహించడంలో సహాయపడుతుంది.






