- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
షాకింగ్.. పైల్స్ క్యాన్సర్‌కు దారితీస్తాయా?
దీర్ఘకాలిక మలబద్ధకం, గర్భం, ఊబకాయం, మలవిసర్జన సమయంలో ఒత్తిడి, ఎక్కువ సేపు కూర్చోవడం వంటి అంశాలు పైల్స్(హెమోరాయిడ్స్)కు దారితీస్తాయి. పురీషనాళం లేదా మలద్వారంలో రక్త నాళాలు వాపు చెందడం

దిశ, ఫీచర్స్ : దీర్ఘకాలిక మలబద్ధకం, గర్భం, ఊబకాయం, మలవిసర్జన సమయంలో ఒత్తిడి, ఎక్కువ సేపు కూర్చోవడం వంటి అంశాలు పైల్స్(హెమోరాయిడ్స్)కు దారితీస్తాయి. పురీషనాళం లేదా మలద్వారంలో రక్త నాళాలు వాపు చెందడం, దిగువ పురీషనాళంలో పెరిగిన ఒత్తిడి కారణంగా డెవలప్ అవుతాయి. ఇక పైల్స్ రెండు రకాలు కాగా అంతర్గత పైల్స్.. పురీషనాళం లోపల ఉంటాయి. బాహ్య పైల్స్ మలవిసర్జన సమయంలో నొప్పి, దురద, వాపు, అసౌకర్యం కలిగిస్తాయి. అయితే పైల్స్.. క్యాన్సర్‌కు దారితీస్తున్నాయనే భయం జనాల్లో ఎక్కువైపోయింది. ఇది ఎంత వరకు నిజం? నిపుణులు ఏం చెప్తున్నారు?
బలంగా లేదా పెద్దగా మలం పోవడం, దీర్ఘకాలిక విరేచనాలు, ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజ్ (IBD), డెలివరీ సమయంలో గాయం మలద్వారం దగ్గర చిరిగిపోవడం వంటి లక్షణాలకు దారితీస్తాయి. ఈ ఆసన పగుళ్లు దీర్ఘకాలికంగా మారే ప్రమాదం కూడా ఉంది. దీనివల్ల వైద్యం చేయడం మరింత కష్టమవుతుంది. దీంతో చాలా మంది పైల్స్ లేదా పగుళ్లు క్యాన్సర్‌గా అభివృద్ధి చెందుతాయని తప్పుగా అనుకుంటారు. కానీ అలా జరగదని స్పష్టం చేస్తున్నారు ఎక్స్‌పర్ట్స్. మల రక్తస్రావం, నొప్పి వంటి లక్షణాలు కొన్నిసార్లు కొలొరెక్టల్ లేదా ఆసన క్యాన్సర్‌తో అతివ్యాప్తి చెందుతాయి. కాబట్టి గందరగోళం తలెత్తుతుంది. పైల్స్ క్యాన్సర్‌ను అభివృద్ధి చేస్తాయనే ప్రచారం జరుగుతుంది.
పైల్స్ నివారణ చిట్కాలు
* మలాన్ని మృదువుగా చేయడానికి ఫైబర్ ఎక్కువగా తీసుకోవాలి.
* పుష్కలంగా నీరు తాగుతూ బాడీని హైడ్రేటెడ్‌గా ఉంచాలి.
* గంటలు గంటలు కూర్చున్న దగ్గరే ప్రాసెస్ చేసిన ఆహారాలను తినే అలవాటు మానుకోవడం
* నొప్పి ఉపశమనం కోసం వెచ్చని నీటితో స్నానం
* ట్రీట్మెంట్, నొప్పి నివారణ మందుల వినియోగం
* తీవ్రమైన సందర్భాల్లో దీర్ఘకాలిక ఉపశమనం కోసం శస్త్రచికిత్స అవసరం కావచ్చు.






