నిన్ను నువ్వు ప్రేమించుకో.. ఓటమి నుండి నేర్చుకో..! మహిళలకు బాలీవుడ్ నటి దీపికా పదుకొనె సూచనలివే..

by Javid Pasha |   (  Updated:2025-10-14 00:57:18  IST  )

‘సమస్యలూ సవాళ్లు, అవమానాలూ అభాండాలు, వివక్షతలూ విమర్శలు సమాజం నుంచి ఎదురవుతూనే ఉంటాయి. మీరెప్పుడైతే వాటిని ఎదుర్కొంటారో అప్పుడవే మీకు తలవంచుతాయి’ అంటున్నారు బాలీవుడ్ నాటి దీపికా పదుకొనె. మహిళలకు ఆమె ఇస్తున్న సందేశం ఏమిటంటే..

నిన్ను నువ్వు ప్రేమించుకో.. ఓటమి నుండి నేర్చుకో..! మహిళలకు బాలీవుడ్ నటి దీపికా పదుకొనె సూచనలివే..
X

దిశ, ఫీచర్స్ : వెయ్యి మైళ్ల దూరమైనా సరే.. ప్రారంభమనేది మొదటి అడుగుతోనే మొదలవుతంది. అందుకే ఒక మహిళగా మీరు ఏదైనా సాధించాలంటే ధైర్యంగా ముందడుగు వేయండి.. అంతేకానీ ఓటమి భయంతో తొలి అడుగులోనే తడబడకండి అంటారు ప్రముఖ బాలీవుడ్ నటి దీపికా పదుకొనె. ‘సమస్యలూ సవాళ్లు, అవమానాలూ అభాండాలు, వివక్షతలూ విమర్శలు సమాజం నుంచి ఎదురవుతూనే ఉంటాయి. మీరెప్పుడైతే వాటిని ఎదుర్కొంటారో అప్పుడవే మీకు తలవంచుతాయి’ అంటున్న దీపికా పదుకొనె ఇటీవల యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ (MoHFW) ద్వారా మెంటల్ హెల్త్ అంబాసిడర్‌గా ఎంపియ్యారు. ఈ నేపథ్యంలో మహిళలకు ఆమె చేస్తున్న సేవలు, అందిస్తున్న సందేశాల గురించి సోషల్ మీడియా వేదికల్లో చర్చ జరుగుతోంది.

సెల్ఫ్ లవ్ & బాడీ పాజిటివిటీ

‘మహిళ సమానత్వం, సమభావం, వివిధ రంగాల్లో సక్సెస్ సాధించాలంటే సామాజిక అంచనాలకు భయపడకూడదు. సమస్యలను, సవాళ్లను ఎదుర్కొని నిలబడాలి. అందుకోసం ముందు నిన్ను నువ్వు ప్రేమించుకో.. నిన్ను నువ్వు గౌరవించుకో.. ఓటమి నుంచి నేర్చుకో.. నీ సొంత శరీరాన్ని నువ్వు ఇష్టపడు. ఎందుకంటే సెల్ఫ్-లవ్, బాడీ పాజిటివిటీ నీలో ఆత్మ విశ్వాసాన్ని నింపుతాయి. అది చాలా ముఖ్యం’ అంటున్న దీపికా పదుకొనె మహిళలు తమకు కావాల్సిన దానిపై ఫోకస్ చేయాలని, ఎమోషనల్ స్ట్రెంగ్త్ కలిగి ఉండాలని సూచిస్తున్నారు. మహిళలు పురుషులకంటే తక్కువనే భావన ఒకప్పుడు ఎక్కువగా ఉండేది, సమాన గౌరవం, సమాన వేతనం వంటివి కూడా తిరస్కరించబడేవి. కానీ పరిస్థితులు మారాయి. మహిళలు మాట్లాడటం, పోరాడటం, ధైర్యంగా ముందడుగు వేయడంవల్లే అదంతా జరిగింది అంటున్న దీపిక పదుకొనె 8 గంటలు వర్క్ డే డిమాండ్‌లో జెండర్ బయాస్‌పై కూడా గతంలో అనేక విషయాలు మాట్లాడారు.

ఫెయిల్యూర్ నుంచి నేర్చుకోండి

ఓటమి అనేది వాస్తవానికి వైఫల్యం కాదు. అదొక అనుభవం. దాని నుంచి గుణపాఠం నేర్చుకుంటేనే విజయం సాధిస్తాం. క్రీడలు అందుకు చక్కటి ఉదాహరణ. ఒకసారి ఓడిపోగానే ఎవరూ ప్రయత్నం మానేయరు. నేను బ్యాడ్మింటన్ బ్యాగ్రౌండ్ నుంచి వచ్చాను. అప్పట్లో స్పోర్ట్స్ ఆడటం, ఓటమి పాలవడం, మళ్లీ నెగ్గడం వంటి అనుభవాలు నాకు ఫెయిల్యూర్‌ను, సక్సెస్‌ను ఎలా హ్యాండిల్ చేయాలో నేర్పాయి. అందుకే చెప్తు్న్న ఫెయిల్యూర్ అంటే భయపడకండి. దాని నుంచి సక్సెస్ ఎలా సాధించాలో నేర్చుకోండి.

ఆత్మ విశ్వాసంతో ఏదైనా సాధ్యం

మీరు దేన్నైనా హ్యాండిల్ చేయగలమనే ఆత్మ విశ్వాసంతో ఉన్నప్పుడు.. ఏదైనా సాధించగలుగుతారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఏర్పడుతుంది. జీవితంలో వర్క్ అండ్ లైఫ్ బ్యాలెన్స్ దీనిద్వారా సాధ్యం అవుతుంది. 2014లో ఓన్ డిప్రెషన్ జర్నీ నుంచి 2015 లో ‘లైవ్ లవ్ లాఫ్ (LLL)’ ఫౌండేషన్ స్థాపన వరకు నేను అదే చేశాను. ఫిల్మ్ ఇండస్ట్రీలో మహిళలు (మెథర్స్) 8-గంటలు వర్క్ చేస్తున్నా, ఆ విషయాలు హెడ్‌లైన్స్ కావు. కానీ మహిళలు బౌండరీస్ సెట్ చేస్తే ‘Pushy’ అని హేళన చేస్తుంటారు. ఇది బ్రూటల్ జెండర్ బయాస్(Brutal Gender Bias) కాదా..? అందుకే మహిళలుగా మీరు ఏ రంగంలో ఉన్నా హక్కుల కోసం, ఆత్మ గౌరవం కోసం, ఫెయిర్‌నెస్ కోసం పోరాడాలి. అప్పుడే ఏదైనా సాధిస్తారు.

READ MORE ......

అపజయాలు కలిగిన చోటే విజయానికి శ్రీకారం.. ఓ మహిళ సక్సెస్ జర్నీ..!



Next Story