- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అపజయాలు కలిగిన చోటే విజయానికి శ్రీకారం.. ఓ మహిళ సక్సెస్ జర్నీ..!
గూగుల్ ఫర్ స్టార్టప్స్ – ఇండియా హెడ్‌గా అవకాశం పొందిన రాగిణి దాస్ భారతదేశంలోని స్టార్టప్‌లకు మద్దతు, మెంటరింగ్, రిసోర్సెస్ అందించడంలో కీలక పాత్ర పోషిస్తోంది.

దిశ, ఫీచర్స్ : చిన్న అవమానం ఎదురైనా భరించలేక తిరుగుముఖం పడతారు కొందరు. తిరస్కరణను ఎదుర్కోలేక ప్రయత్నాలు మానేస్తారు మరికొందరు. కానీ అందరూ అలాగే ఉండరండోయ్.. సమస్యలు ఎదరైన చోటే పరిష్కారం వెతికే దమ్మున్న వాళ్లు సైతం ఉంటారు. సవాళ్లకు ఎదురీది మరీ సక్సెస్ వైపు అడుగేస్తారు. సరిగ్గా ఈ కోవకు చెందిన వ్యక్తే రాగిణి దాస్. ఒకప్పుడు ఉద్యోగ ప్రయత్నంలో భాగంగా తిరస్కరణకు గురైన గూగుల్ సంస్థలోనే లీడర్‌షిప్ స్థాయికి ఎదిగిన ఆమె సక్సెస్ జర్నీ నేటి యువతకు ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. ఆ వివరాలేంటో చూద్దాం పదండి!
బాల్యం, విద్యాభ్యాసం
పేరు రాగిణి దాస్. ఊరు హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్. ఓ నిరుపేద కుటంబంలో జన్మించిన ఈమె బాల్యం ఇక్కడే గురుగ్రామ్‌లోనే గడిచినప్పటికీ, ఉపాధి రీత్యా ఆమె కుటుంబం చెన్నైకి మారడంతో పాఠశాల విద్యను కూడా చెన్నైలోని చెట్టినాడ్ విద్యాశ్రమ్ పాఠశాలలో పూర్తి చేసింది. ఆ తర్వాత కాలేజీ రోజుల్లో ఆమె తన కళాశాల విభాగంలోని స్టూడెంట్స్ కల్చరల్ సెక్రటరీగానూ పనిచేసింది. తమ కూతుర్ని పెద్ద చదువులు చదివించాలన్న తల్లిదండ్రుల కోరిక, అందుకు తగినట్లు ఉపాధ్యాయుల సలహా ఆమె పై చదువు కొనసాగిండచంలో కీ రోల్ పోషించాయి. తర్వాత యునైటెడ్ కింగ్డమ్‌లోని లంకాస్టర్ యూనివర్సిటీలో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో బ్యాచిలర్ డిగ్రీ సాధించింది. ఈ నేపథ్యమే ఆమె మార్కెటింగ్ అండ్ సేల్స్ ఎంటర్ ప్రెన్యూర్‌షిప్‌లోకి ఎంట్రీ ఇవ్వడానికి దోహదపడింది.
గూగుల్ ఇంటర్వ్యూలో తిరస్కరణ
2012లో ట్రైడెండ్ గ్రూప్ ఇండియాలో మార్కెటింగ్‌లో కెరీర్ ప్రారంభించిన ఆమె ఎలాగైనా వరల్డ్ ఫేమస్ టెక్ దిగ్గజమైన గూగుల్లో ఉద్యోగం సంపాదించాలని కలలు గన్నది. ఆ ప్రయత్నంలో భాగంగా 2013లో గూగుల్ రిక్రూట్‌మెంట్ సెషల్‌లో భాగంగా ఇంటర్వ్యూకు హాజరైన రాగిణి లాస్ట్ రౌండ్‌లో తిరస్కరించబడింది. తన డ్రీమ్ జీమ్ జాబ్ కోల్పోయానన్న బాధ ఒకవైపు ఉన్నప్పటికీ, తాత్కాలికంగా నిరాశకు గురైనప్పటికీ ఏదో ఒకరోజు గొప్పస్థాయికి ఎదగాలన్న లక్ష్యాన్ని మాత్రం ఆమె వదులుకోలేదు. అదే సమయంలో జోమాటోలో సేల్స్ & మార్కెటింగ్ మేనేజర్‌గా చేరి, జోమాటో గోల్డ్‌ను 10 దేశాల్లో లాంచ్ చేసింది. ఈ క్రమంలోనే ఆమె 2020లో మహిళల ప్రొఫెషనల్ నెట్వర్క్‌గా Co-founded Leap.Club ను స్థాపించింది. మహిళలను వివిధ రంగాల్లో ప్రోత్సహించడం మొదలు పెట్టింది.
కోల్పోయిన చోటే.. లీడర్‌షిప్ స్థాయికి
ఎన్నో ఒడిదుడుకులను తట్టుకొని నిలబడిన రాగిణి దాస్.. 2025 జూన్‌లో Co-founded Leap.Clubను తాత్కాలికంగా పాజ్ చేసింది. సరిగ్గా.. ఈ క్రమంలో ఆగష్టులో గూగుల్లో ఉద్యోగ ప్రయత్నం ప్రారంభించిన ఆమె అదే ఏడాది అక్టోబర్‌లో గూగుల్ ఫర్ స్టార్టప్స్ – ఇండియా హెడ్‌గా అవకాశం పొందింది. ప్రస్తుతం ఆమె వయసు 35 సంవత్సరాలు. గూగుల్ ఫర్ స్టార్టప్స్ – ఇండియా హెడ్‌గా పనిచేస్తూనే, భారతదేశంలోని స్టార్టప్‌లకు మద్దతు, మెంటరింగ్, రిసోర్సెస్ అందించడంలో కీలక పాత్ర పోషిస్తోంది. అలాగే ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ( FICCI) విమెన్ ఇన్ స్టార్టప్స్ కమిటీ చైర్‌గానూ కొనసాగుతోంది. ‘మొదటి ప్రయత్నంలోనే నిరాశ చెంది, వెనుకడుగు వేసి ఉంటే నేడు ఈ స్థాయికి చేరేదానిని కాదు’ అంటున్న రాగిణి దాస్ సక్సెస్ జర్నీ నేటి మహిళలకు ఒక స్ఫూర్తి. ఒక ప్రేరణ అనడంలో ఏమాత్రం సందేహం లేదు. వైఫల్యాలను సవాలుగా స్వీకరించినప్పుడే సక్సెస్ సాధించగలమనడానికి మరో నిదర్శనం రాగిణిదాస్ జీవితం. లింక్
READ MORE ......
నిన్ను నువ్వు ప్రేమించుకో.. ఓటమి నుండి నేర్చుకో..! మహిళలకు బాలీవుడ్ నటి దీపికా పదుకొనె సూచనలివే..






