- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
God Forest : దేవతలు నడయాడిన అడవి నేల.. మహిమ గలదా?
God Forest : దేవతలు నడయాడిన అడవి నేల.. మహిమ గలదా?

దిశ, ఫీచర్స్ : ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు తిరుగాడుతుంటారని భగవద్గీత చెబుతుంది. ఎక్కడైతే నిజాయితీగల మనుషులు నివసిస్తుంటారో అక్కడ పాజివ్ ఎనర్జీ అద్భుతాలు క్రియేట్ చేస్తుందని మానసిక శాస్త్రం చెబుతుంది. సైన్స్ కొన్నింటిని కొట్టిపారేస్తుంది. అయినప్పటికీ అవి ప్రజల్లో బలమైన భావాలుగా, విశ్వాసాలుగా నాటుకుపోయి చలామణి అవుతుంటాయి. దేవుడు, దెయ్యం, మంత్రాలు, అతీత శక్తులు వంటివి అలాంటి అవాస్తవిక భావనల కోవలోకే వస్తాయి. జపాన్‌లోని ప్రాంత ప్రజల నమ్మకాలు కూడా అదే గుర్తు చేస్తున్నాయి. ఇక్కడి వృక్షాలపైన, చెట్ల కింద ఇప్పటికీ దేవతలు తిరుగాడుతుంటారని వారు నమ్ముతుంటారు.
కంటికి రెప్పాలా కాపాడుకుంటూ..
అది జపాన్‌లోని కిటయామా (Kitayama ) గ్రామం. హిగాషిమురో జిల్లా వాకయామా (Wakayama Prefecture) ప్రాంతంలో కిటయామా నది వెంబడి విస్తరించి ఉంది. కాగా ఇక్కడికి సమీపంలో పొడవైన దేవదారు వృక్షాలతో దట్టడమైనచ అడవి ఉంది. అయితే స్థానిక గిరిజన ప్రజలు ఇది దేవతలు సృష్టించిన పవిత్రమైన అడవి అని నమ్ముతుంటారు. కాబట్టి కంటికి రెప్పలా కాపాడుకుంటారు. అక్కడ ఎవరు కూడా దేవదారు (డైసుకి) చెట్లను అస్సలు నరకరు. కాకపోతే తమ నివాసాలకు ఈ కలపగా వీటిని వినియోగిస్తుంటారు. చెట్లను నరకకుండానే పాకలు లేదా గుడిసెలు, ట్రీ హౌస్ వంటి నిర్మాణాలకు ఉపయోగించడం ఎలా సాధ్యం అంటారా? అది తమకు దేవుడిచ్చిన ఐడియాగా ఇక్కడి ప్రజలు చెబుతుంటారు. కాకపోతే అందుకే ప్రాణం పోయినా నరకరు. పైగా భవిష్యత్తులో తమ ఇంటి నిర్మాణానికి అవసరమైన కలప చెట్ల కొమ్మలపై, మరో రెమ్మగా ఉద్భవించేందుకు కట్టు కడతారు. అలా కొంత కాలానికి (దాదాపు 10 నుంచి 15 ఏండ్లు) పెరిగిన చెట్లను మాత్రమే కట్ చేస్తారు. అంటే చెట్టు తల్లివేరు అస్సలు చావదు. చెట్టు ఎండిపోదు.
700 ఏండ్ల కిందటే అలా..
దేవతలు నడయాడే జపనీస్ దేవారు (డైసుగి) చెట్లను స్థానిక ప్రజలు పవిత్రమైనవిగా భావించడం వెనుక 700 సంవత్సరాల నాటి చరిత్ర ఉంది. అప్పట్లోనే ‘డైసుగి టెక్నిక్’ ద్వారా ఇక్కడి ప్రజలు చెట్లను నరకకుండానే.. అవసరమైన కలపను అందమైన ఆకృతిలో చెక్కడం ద్వారా పొందేవారు. ఈ పురాతన జపనీస్ ఫారెస్ట్రీ టెక్నిక్‌ను మొదట కిటయామా రీజియన్‌లో నివసించే ప్రజలు ఉపయోగించారు. ఎందుకంటే ఈ భూభాగంలో మొక్కలు, చెట్లు చాలా తక్కువగా పెరుగుతుంటాయి. దేవదారులు మాత్రమే ఎక్కువగా పెరుగుతాయి.
Read Also..
ఆ వ్యాధులు ఉన్నవారు ఈ పండును తింటే కోరి మరీ సమస్యలు తెచ్చుకున్నట్టే..






