ఆ వ్యాధులు ఉన్నవారు ఈ పండును తింటే కోరి మరీ సమస్యలు తెచ్చుకున్నట్టే..
ఎన్నో పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న అంజీర పండ్లు ఆరోగ్యానికి ఎంతో మంచిది. కానీ, వీటిని ఇష్టమొచ్చినట్లు తినడం వల్ల కోరి మరీ సమస్యలు తెచ్చుకున్నట్లు అయిపోతుంది.
అంజీర పండ్లలో అధిక మొత్తంలో కేలరీలు ఉంటాయి. కాబట్టి గర్భిణీలు ఇలాంటి అధిక కేలరీలు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి నష్టం కలుగుతుంది.
పాలిచ్చే మహిళలకు కూడా వీటిని ఎక్కువగా తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం.
అంజీర పండ్లలో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల మధుమేహం ఉన్నవారు ఈ పండ్లను తినడం మంచిది కాదు.
కొంతమందికి అంజీర పండ్లతో అలెర్జీ ఉండవచ్చు. అలాంటివారు ఈ పండును తీసుకోవడం ముందు వైద్యులను సంప్రదించడం మంచిది.
జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలు ఉన్నవారు కూడా ఈ పండ్లను తినడం వలన నష్టం జరగవచ్చు.
బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తున్న వారు కూడా అంజీర పండ్లను తినకూడదు. ఎందుకంటే ఇందులో ఎక్కువ కేలరీలు ఉంటాయి.
మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు, గుండె జబ్బుతో బాధపడుతున్న వారు ఈ పండ్లను తీసుకోవడం హానికరం. ఎందుకంటే అంజీరలో అధిక పొటాషియం ఉంటుంది కనుక ఇది గుండెపై ప్రభావం చూపవచ్చు.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.