- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జస్ట్ 40 నిమిషాల నడక.. వృద్ధాప్యంలో జ్ఞాపకశక్తిని పెంచే గ్రేట్ మెడిసిన్..!
వారానికి మూడు సార్లు 40 నిమిషాలు వాకింగ్ చేస్తున్న వృద్ధుల్లో మెదడు 2% పెరిగి, జ్ఞాపక శక్తిని పెంచుతుందని అధ్యయనం తెలిపింది.

దిశ, ఫీచర్స్ : వృద్ధాప్య దశలో వయసు పెరిగే కొద్దీ జ్ఞాపక శక్తి తగ్గుతుందని పెద్దలు చెబుతుంటారు. కాగా అలా జరుగుతుందేమోననే ఈ ఆలోచన చాలా మందికి నిద్రను సైతం దూరం చేస్తుంది. కాగా మెదడులోని జ్ఞాపక కేంద్రమైన (memory center) హిప్పోకాంపస్ ఏజ్ పెరిగే కొద్దీ కుంచించుకుపోవడం కూడా అందుకు కారణమని కూడా నిపుణులు చెబుతుంటారు. అయితే అలా జరగకుండా ఆపవచ్చునని పిట్స్‌బర్గ్ యూనివర్సిటీ పరిశోధకుల అధ్యయనం వెల్లడించింది. అందుకు చక్కటి పరిష్కారం వాకింగ్.
అధ్యయనంలో భాగంగా 120 మంది వృద్ధులను నిపుణులు పరిశీలించారు. వీరిలో వారానికి మూడు సార్లు 40 నిమిషాలు వాకింగ్ చేస్తున్న వారిలో ఒక సంవత్సరం తర్వాత వారి హిప్పోకాంపస్ 2% పెరిగిందని, పైగా ఈ మెదడు పెరుగుదల నేరుగా వారి జ్ఞాపకశక్తిని మెరుగుపరిచిందని కనుగొన్నారు. అందుకే నడక అంటే కేవలం కార్డియో వ్యాయామం మాత్రమే కాదు, అది మెదడుకు ఔషధం వంటిదని పరిశోధకులు సూచిస్తున్నారు. వృద్ధాప్యంలో సైతం అల్జీమర్స్ బారిన పడకుండా ఉండేందుకు, మెరుగైన జ్ఞాపక శక్తికి నడక చాలా ముఖ్యమని చెబుతున్నారు. Link






