అలసటగా ఉంటే నిల్చునే కునుకు తీయవచ్చు.. వర్టికల్ పాడ్స్‌‌ను తయారు చేసిన జపాన్

by Dishanational2 |
అలసటగా ఉంటే నిల్చునే కునుకు తీయవచ్చు.. వర్టికల్ పాడ్స్‌‌ను తయారు చేసిన జపాన్
X

దిశ, ఫీచర్స్ : కొందరికి కారులో ప్రయాణిస్తున్నప్పుడు నిద్ర ముంచుకొస్తుంది. మరి కొందరికి బయటకు వెళ్లినప్పుడు అలసటతో కునుకు తీయాలనిపిస్తుంది. అలాంటప్పుడు ఇంటికొచ్చేదాక నిద్రను ఆపుకోవడం తప్ప మరేం చేయలేం. కానీ ఇక నుంచి ఆ పరిస్థితిని ఎదుర్కోవడానికి ఇబ్బందులు తొలగవచ్చు. దారిమధ్యలో ఏ కాఫీ షాప్‌లోకో వెళ్లి కాసేపు ప్రశాంతంగా నిద్రపోవచ్చు. అది కూడా నిల్చుని ఉండగానే గాఢమైన నిద్రలోకి జారుకోవచ్చు. అదెలా సాధ్యమంటే.. ఒక జపనీస్ కంపెనీ జిరాఫెనాప్ (Giraffenap) అనే స్లీపింగ్ పాడ్‌లను తయారు చేసింది. ఇవి వ్యక్తుల్లో ఏకాత్రను, పనిసామర్థ్యాన్ని మెరుగు పరిచే విధంగా పగటిపూట పవర్ న్యాప్స్‌ను ప్రోత్సహిస్తాయట. హార్డ్ వర్కింగ్ కంట్రీ అని పేరున్న జపాన్, ఇక్కడి ప్రజలు, ఉద్యోగులు మధ్య మధ్యలో అవసరమైనప్పుడు తమ అలసటను తీర్చుకునేందుకు ఈ స్లీపింగ్ పాడ్‌లను ప్రోత్సహిస్తోంది. వర్క్ స్ట్రెస్ నుంచి రిలీఫ్ కోసం జపనీస్ కార్మకులు ఇప్పటికే షార్ట్ పరవర్ న్యాప్స్ వైపు మొగ్గు చూపుతున్నారట.

జిరాఫెనాప్ పాడ్‌లు నిలువుగా ఉండి, సెట్ చేయగల అలారం సిస్టమ్‌ను కలిగి ఉంటాయి. ఈ విధమైన డిజైన్ రూపొందించడం వెనుక ప్రధాన కారణాలలో ఒకటి తక్కువ స్పేస్ తీసుకోవవడం. చాలా చిన్న కేఫ్‌లు, రెస్టారెంట్లలో కూడా వాటిని ఇన్‌స్టాల్ చేయడానికి వీలవుతుంది. ఈ పాడ్‌లకోసం ఒక చిన్న క్యాబిన్ లేదా గది ఉంటే సరిపోతుంది. స్టాండ్-అప్ పొజిషన్‌‌లో జిరాఫెనాప్స్‌ను ఉపయోగించవచ్చు. అంతేగాక ఇవి వ్యక్తులు తమ హెడ్, బట్టక్స్, ఫీట్స్ శరీరంలోని వివిధ భాగాలకు అనుగుణంగా సెట్ చేసుకోగల సపోర్ట్ పాయింట్‌లను కలిగి ఉంటాయి. నిద్రపోతున్నప్పుడు తమకు నచ్చిన విధంగా నిటారుగా ఉండేలా సెట్ చేసుకోవచ్చు. అలాగే హైట్ అడ్జస్ట్ మెంట్స్ కూడా చేసుకోవచ్చు. తద్వారా ఎవరైనా సరే తమకు అనువైన భంగిమను సెట్ చేసుకొని ప్రశాంతంగా నిద్రపోవచ్చు. ఈ స్లీపింగ్ పాడ్‌లు ప్రస్తుతం రెండు వేరియంట్‌లలో లభిస్తున్నాయి. ఒకటి ప్లేన్ వైటెడ్ మోడల్, రెండవది ట్రెడీషనల్ బంబూ డిజైన్. ఈ రెండు కూడా గ్రేట్ సౌండ్ ఇన్సులేషన్‌ను అందిస్తాయి. అలాగే నిద్రను ప్రేరేపించడానికి రూపొందించబడిన బ్యూటిఫుల్ రిలాక్స్‌డ్ సౌండ్ సిస్టమ్స్, అంతర్నిర్మిత వెంటిలేషన్ సిస్టమ్స్‌ను కలిగి ఉంటాయి.

Read More: గిన్నిస్ రికార్డ్: ఈ టీ పాట్ ధర రూ. 24 కోట్లు.. దాని ప్రత్యేకత ఏంటో తెలుసా..?

Next Story