గుర్తు తెలియని వాహనం ఢీకొని విద్యార్థి మృతి

by Aamani |
గుర్తు తెలియని వాహనం ఢీకొని  విద్యార్థి మృతి
X

దిశ,తొర్రూరు: గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ఒక విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన మహబూబాబాద్ జిల్లా తోరూర్ మండలం లో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తొర్రూరు మండలం పత్తేపురం స్టేజి వరంగల్ ఖమ్మం ప్రధాన రహదారిపై ద్విచక్ర వాహనం AP 09 CE 6132 వాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో బనోత్ భారత్(19) గ్రామం నరసింహుల పేట చెందిన ఇంటర్ విద్యార్థి అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుని బావ గుగులోత్ రఘు (25)గ్రామం నరసింహుల పేట వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి.బాధితులను తొర్రూరులో ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారని తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story

Most Viewed