చిన్న మిల్లర్లకు నిత్యం వేధింపులు.. మిల్లర్లకు రెడ్ కార్పెట్

by Shiva |
చిన్న మిల్లర్లకు నిత్యం వేధింపులు.. మిల్లర్లకు రెడ్ కార్పెట్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్టంలో చిన్న, మధ్య తరహా మిల్లర్ల పరిస్థితి దారుణంగా ఉందని కొందరు మిల్లర్లు మంగళవారం సీఎం రేవంత్‌రెడ్డికి పౌర సరఫరాల శాఖ తీరుపై ఫిర్యాదు చేశారు. పౌర సరఫరాల శాఖ అధికారులు చిన్న మిల్లర్లకు సతాయిస్తూ పెద్ద మిల్లర్లకు పెద్దపీట వేస్తున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. సీఎంఆర్ రైస్ రికవరీ విషయంలో పౌర సరఫరాల శాఖ సమాచారాన్ని దాచిపెడుతోందిని మెదక్ జిల్లా పాపన్నపేటకు చెందిన శ్రీ బాలాజీ రైస్ మిల్ యజమాని సీహెచ్ భూపాల్‌రెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు. సీఎంఆర్ రైస్ ఇవ్వకుంటే మిల్లర్లపై చర్యలు తప్పవని హెచ్చరించి ఆ తరువాత సైలెంట్‌ అవుతున్నారని తెలిపారు. రూ.వేల కోట్లు విలువ చేసే సీఎంఆర్ రైస్ సబ్మిట్ చేయకుంటే క్రిమినల్ కేసులు పెడతామని, రెవెన్యూ రికవరీ యాక్ట్ అని హడావిడి చేసి తీరా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. డిఫాల్ట్ మిల్లర్ల గురించి అంతా గోప్యంగా ఉందన్నారు.

ఆదిలాబాద్, వరంగల్, మెదక్, నల్గొండ కరీంనగర్ జిల్లాలో మిల్లర్లు ఇంకా సీఎంఆర్ రైస్ ఇవ్వలేదని తెలిపారు. ఆ జిల్లా మిల్లర్ల యజమానులపై పౌర సరఫరాల శాఖ అధికారులు చర్యలకు వెనుకాడుతున్నారని ఆరోపించారు. అలా మిల్లర్లపై చర్యలు చేపట్టకపోవడం వల్ల అధికారులు మిల్లర్లతో ములాఖాత్ అయ్యారనే టాక్ వినిపిస్తోందని ఆరోపించారు. కొందరు మిల్లలపైనే హడావిడి చేసి.. మిగతా మిల్లర్లను అధికారులు లైన్‌లోకి తీసుకుని వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని పేర్కొన్నారు. పౌర సరఫరాల శాఖ అధికారుల అవినీతితోనే తాము డిఫాల్టర్లుగా మారమని ఆవేదన వ్యక్తం చేశారు. అతిపెద్ద తిమింగలాలు పౌర సరఫరాల శాఖలోనే ఉన్నారని తెలిపారు. తన ఫిర్యాదులో డిఫార్టర్ మిల్లర్లను పేర్కొనడంతో ఇప్పుడు పౌర సరఫరాల శాఖ గందరగోళంలో పడ్డారని తెలిపారు. బడా మిల్లర్లను అధికారులు టచ్ చేయకపోవడంతో అసలు అవినీతిపరులు, మిల్లర్లా లేక అధికారులా అన్న చర్చ జరుగుతోందిని పేర్కొ్న్నారు.



Next Story