గాలి ద్వారా కాఫీ తయారు చేయొచ్చు..! పాలు, నీరు అవసరమే లేదు!!

by Javid Pasha |   (  Updated:2026-04-06 15:05:48  IST  )

గాలిలోని తేమను ఉపయోగించి , నీటిని ఉత్పత్తి చేసుకొని కాఫీ తయారు చేయగల మెషిన్‌‌ను నిపుణులు అభివృద్ధి చేశారు.

గాలి ద్వారా కాఫీ తయారు చేయొచ్చు..! పాలు, నీరు అవసరమే లేదు!!
X

దిశ, ఫీచర్స్ : ఆధునిక సాంకేతికత అద్భుతాలు చేస్తోంది. మానవాళికి మేలు చేసే ఎన్నో ఆవిష్కరణలకు కారణం అవుతోంది. తాజాగా న్యూయార్క్ సిటీకి చెందిన ఓ కంపెనీ అదే చేసింది. గాలి నుంచి నీటిని సేకరించి, దానితో కాఫీ తయారు చేయగల Kara Pod అనే కాఫీ మెషిన్‌ను అభివృ‌ద్ధి చేసింది. ఇది ప్రపంచంలోనే మొదటి ‘సెల్ఫ్-రీఫిల్లింగ్ కాఫీ మెషిన్‌’గా దాని తయారీ దారులు పేర్కొంటున్నారు. ఇంతకీ ఇదెలా పనిచేస్తుంది? ఉపయోగాలేమిటో ఇప్పుడు చూద్దాం.

కాఫీ తయారు చేయాలంటే.. సాధారణంగా నీరు, కాఫీ పౌడర్ అవసరం. అయితే ఇక నుంచి కేవలం బ్లాక్ కాఫీ కావాలంటే మీరు కారాపాడ్ మెషిన్ వాడొచ్చు. ఇది ట్యాప్ వాటర్ లేదా బాటిల్ నీరు ఏవీ లేకుండానే కేవలం గాలిలో ఉన్న తేమను(humidity) ఉపయోగించి నీటిని ఉత్పత్తి చేసుకొని, మినరల్-రిచ్ నీటితోనే కాఫీ బ్రూ చేస్తుంది. పైగా ఈ మెషిన్ కౌంటర్‌టాప్ సైజులో ఉండి, సాధారణ ఇంటి వంటగదిలో సులభంగా అమర్చుకోవచ్చు అంటున్నారు నిపుణులు. 2025 CES ఇన్నోవేషన్ అవార్డ్స్‌లో గుర్తింపు పొందిన ఈ టెక్నాలజీ ఇప్పుడు Kickstarterలో క్రౌడ్‌ఫండింగ్ ద్వారా అందుబాటులోకి వస్తోంది.

ఎలా పని చేస్తుంది?

కారాపాడ్ అనే(Kara Pod) మెషిన్ ముందు గాలిని లోపలికి తీసుకుని, దానిలోని తేమను చల్లబరిచి(At a temperature below the dew point) నీటిగా మార్చేస్తుంది. ఆ తర్వాత హీట్ ట్రీట్‌మెంట్, డ్యూయల్ యూవీ(UV) స్టెరిలైజేషన్, కార్బన్ ఫిల్టర్ ద్వారా శుద్ధి చేసి, మినరల్స్ జోడించి అల్కలైన్ వాటర్‌గా మారుస్తుంది. ఈ నీటితోనే కాఫీ బ్రూయింగ్ చేస్తుంది. సరైన తేమ ఉన్న పరిస్థితుల్లో రోజుకు దాదాపు 3.2 లీటర్లు (సుమారు 1 గాలన్) నీటిని ఉత్పత్తి చేయగలదు. ఇది సుమారు 13 కప్పుల కాఫీకి లేదా 7 చిన్న బాటిల్ నీటికి సమానం. తక్కువ తేమ ఉన్న ప్రాంతాల్లో ఉత్పత్తి తగ్గుతుంది.

బెనిఫిట్స్ ఇవే..

గాలి నుంచి నీటిని సేకరించి కాఫీ తయారు చేసే కారాపాడ్ వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. వాటర్ బాటిల్స్, ప్లాస్టిక్ వేస్ట్, అనవసరం నీటి వినియోగం తగ్గుతుంది. భూమిలో నీటి వనరులు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఎంతో మందికి నీటికొరత వల్ల తలెత్తే ఇబ్బందులను పరిష్కరిస్తుంది. కాబట్టి ఇది సెల్ఫ్-సస్టైనబుల్ టెక్నాలజీకి ఒక మంచి ఉదాహరణగా నిపుణులు పేర్కొంటున్నారు. అయితే ఈ పరికరం ప్రస్తుతానికి(మార్చి 2026) పూర్తిగా మార్కెట్‌లో అందుబాటులో లేదు. కానీ ప్రీ-ఆర్డర్/కిక్‌స్టార్టర్ దశలో ఉందని, క్యాంపెయిన్ జరుగుతోందని నిపుణులు పేర్కొంటున్నారు. అధికారిక వెబ్‌సైట్ ద్వారా ప్రీ-ఆర్డర్ చేయవచ్చునని చెబుతున్నారు.

Read more.. బాడీ టెంపరేచర్ నుంచి విద్యుత్..! స్టిక్కర్ లాంటి డివైజ్‌ ఆవిష్కరణ

Next Story