- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యువతలో 83% మంది కంటెంట్ క్రియేటర్లే..! ఆ నివేదికలో వెల్లడి
తాజా నివేదిక ప్రకారం.. గత సంవత్సరం 91% జెన్ జీలు ఫ్యాన్స్ ఫ్యాన్‌డమ్ యాక్టివిటీస్‌లో పాల్గొనగా, ఇందులో 93 % మంది తమ కంటెంట్ క్రియేట్ కోసం యూట్యూబ్‌ను ప్రధాన వేదికగా ఉపయోగించుకున్నారు.

దిశ, ఫీచర్స్ : పొద్దున్న వాకింగ్ చేస్తుంటాం.. ఒక దృశ్యం మనల్ని ఆకట్టుకుంటుంది. ఒక సంఘటన మనల్ని కలచి వేస్తుంది. ఎలాగూ స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటుంది కాబట్టి చూసింది చూసినట్టు వీడియో తీసి ఇన్‌స్టాలోనో, యూట్యూబ్‌లోనో, ఫేస్‌బుక్ లోనో పోస్ట్ చేసేస్తుంటాం. ఏం జరిగిందో పూసగుచ్చినట్టు వివరిస్తుంటాం. బస్సులోనో, ట్రైన్‌లోనో జర్నీ చేస్తుంటాం.. హాయ్ అంటూ మొదలయ్యే కొన్ని పలకరింపులు పరిచయాలుగా మారుతుంటాయ్.. ఆ అనుభవాలను అక్షరాలుగా అల్లితే అందమైన కథగానో, పొడిగిస్తూ పోతే నవలగానో మారుతుంది. ఈ విధమైన అనుభవాలే భారత దేశంలో అనేకమందిని కంటెంట్ రైటర్లుగా, క్రియేటర్లుగా మార్చేస్తున్నాయి. యూట్యూబ్ ఇండియా అండ్ స్మిత్ జీగర్(India and SmithGeiger) సంయుక్తంగా విడుదల చేసిన తాజా రిపోర్ట్ కూడా అదే వెల్లడించింది. జెన్ జీ(Gen Z)లలో 83% మంది తమను తాము ప్రొఫెషనల్ కంటెంట్ క్రియేటర్లుగా మల్చుకుంటున్నారని పేర్కొన్నది.
కంటెంట్ పట్ల పెరుగుతున్న ఆసక్తి, మారుతున్న ఆలోచన ఈతరం(Gen Z) యువతను ప్రొఫెషనల్ క్రియేటర్లుగా తీర్చి దిద్దడమే కాకుండా, ఇది డిజిటల్ ఎకానమీని ‘క్రియేటర్-లెడ్’గా మార్చేస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. దీనిని బట్టి ఆధునిక యువత తమ క్రియేటివ్ ఆలోచనలను కంటెంట్ క్రియేటర్‌గా మల్చుకోవడంలో ఎలాంటి ప్రతిభను కనబరుస్తున్నదో అర్థం చేసుకోవచ్చునని నిపుణులు చెబుతున్నారు. తాజా నివేదిక ప్రకారం.. గత సంవత్సరం 91% జెన్ జీలు ఫ్యాన్స్ ఫ్యాన్‌డమ్ యాక్టివిటీస్‌లో పాల్గొనగా, ఇందులో 93 % మంది ఇతర సోషల్ మీడియా వేదికలు కలిగి ఉన్నప్పటికీ, తమ ఆసక్తులు, అభిరుచులు పంచుకోవడానికి, కంటెంట్ క్రియేటింగ్, ప్రజెంటేషన్ కోసం యూట్యూబ్‌ను ప్రధాన వేదికగా ఉపయోగించుకున్నారు.
కొత్తగా కంటెంట్ క్రియేటర్లు మారుతున్న వారిలోనూ 62 % మంది తమ స్నేహితుల లేదా నచ్చిన క్రియేటర్ల ఫ్యాన్‌డమ్(Fandom)లతో ప్రేరణ పొందుతూ తమను తాము ప్రొఫెషనల్ క్రియేటర్లుగా మల్చుకుంటున్నారు. ఇది బలమైన ‘నిచ్ డిజిటల్ కమ్యూనిటీల ఆవిర్భావానికి దారితీస్తోందని, యూజర్ల ఆసక్తికి అనుగుణంగా యూట్యూబ్ క్రియేట్స్, షార్ట్స్, సూపర్ చాట్స్, మెంబర్‌షిప్స్, మర్చ్ ఇంటిగ్రేషన్స్ వంటి టూల్స్ ద్వారా క్రియేటర్ ఎకోసిస్టమ్‌ను మరింత బలోపేతం చేస్తున్నామని యూట్యూబ్ ఇండియా డైరెక్టర్ ఇషాన్ జాన్ చటర్జీ పేర్కొన్నారు.
Read More..
చైల్డ్ ఇన్‌ఫ్లూయెన్సర్ల కోసం.. చట్టాన్ని తీసుకొచ్చిన శ్రేయ నల్లమోతు.!






