రెండు నెలల పాటు కేన్ విలియ్‌సన్ క్రికెట్‌కు దూరం

by  |
Kane Williamson
X

దిశ, స్పోర్ట్స్: న్యూజీలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్‌సన్ రెండు నెలల పాటు క్రికెట్‌కు దూరం కానున్నాడు. మోచేతి గాయం కారణంగా ముంబైలో ఇండియా తో జరిగిన రెండో టెస్టులో కేన్ బరిలోకి దిగలేదు. ఆ మ్యాచ్‌లో కివీస్ 372 పరుగుల తేడాతో ఓడిపోయింది. కాగా, కేన్ గాయం గురించి కివీస్ కోచ్ గ్యారీ స్టీడ్ స్పష్టతను ఇచ్చారు. కేన్ విలియమ్‌సన్ విరామం లేకుండా క్రికెట్ ఆడుతున్నాడు. ఇంగ్లాండ్ పర్యటన, డబ్ల్యూటీసీ ఫైనల్, ఐపీఎల్ , టీ20 వరల్డ్ కప్ వరుసగా ఆడాడు. దీంతో అతడి పాత గాయం తీవ్రమైంది. వైద్య పరీక్షల అనంతరం కేన్‌కు సర్జరీ అవసరం లేదు. కానీ ఎనిమిది వారాల విశ్రాంతి అవసరమని చెప్పారు. అందుకే కేన్ క్రికెట్‌కు దూరం అవుతున్నాడని కోచ్ గ్యారీ స్టీడ్ స్పష్టం చేశాడు. న్యూజీలాండ్ జట్టు ముందుగా బంగ్లాదేశ్ వెళ్లి అక్కడ టెస్ట్ సిరీస్ ఆడనుంది. అనంతరం నేరుగా ఆస్ట్రేలియా వెళ్లి జనవరి 30 నుంచి ఫిబ్రవరి 8 వరకు మూడు వన్డేలు, ఒక టీ20 మ్యాచ్ ఆడాల్సి ఉన్నది. ఈ పర్యటనలకు కేన్ విలియమ్‌సన్ దూరం కానున్నాడు.



Next Story

Most Viewed