'ముస్లింలు రిజర్వేషన్ పొందాలి': లాలూ ప్రసాద్ యాదవ్

by Disha Web Desk 17 |
ముస్లింలు రిజర్వేషన్ పొందాలి: లాలూ ప్రసాద్ యాదవ్
X

దిశ, నేషనల్ బ్యూరో: లోక్‌సభ ఎన్నికల వేళ దేశంలో రిజర్వేషన్ల రద్దు గురించిన అంశం తీవ్ర చర్చలకు దారి తీస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీహార్ మాజీ సీఎం, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ మంగళవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ముస్లింలకు రిజర్వేషన్లు ఉండాలని స్పష్టం చేశారు. ఈ రిజర్వేషన్ సామాజిక ఆధారితమైనది కానీ, మతం ఆధారితమైనది కాదని అన్నారు. నేను మండల్ కమిషన్‌ను అమలు చేశాను. రిజర్వేషన్ సామాజిక ఆధారితంగా ఉంటుంది, మతం ఆధారంగా కాదు. మూడో దశ ఎన్నికల తర్వాత మాకు అనుకూలంగా నివేదికలు అందుతున్నాయి. కేంద్ర అధికార కూటమి 200 కూడా దాటదు, కానీ మాపై ఓత్తిడిని పెంచడానికి వారు 400 కంటే ఎక్కువ సీట్లు వస్తాయని అంటున్నారని లాలూ పేర్కొన్నారు.

అంతకుముందు లాలూ మాట్లాడుతూ, ముస్లింలకు రిజర్వేషన్ ప్రయోజనాలను వర్తింపజేయడానికి అనుకూలంగా ఉన్నామని, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాజ్యాంగాన్ని రద్దు చేసి రిజర్వేషన్లను తొలగించాలని చూస్తోందని ఆరోపించారు. ఆర్జేడీ, ఇండియా కూటమి అధికారంలోకి వస్తే రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణంలో మార్పులు చేయడం ద్వారా మైనారిటీ కమ్యూనిటీకి రిజర్వేషన్లు కల్పిస్తాయని బీజేపీ ఆరోపణలు చేయడంతో దానికి కౌంటర్‌గా లాలూ ప్రసాద్ యాదవ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

Next Story

Most Viewed