Lok Sabha Elections 2024: అక్కడ మూడోవిడత పోలింగ్‌ను బహిష్కరించిన ఓటర్లు.. కారణం ఇదే..!

by Disha Web Desk 3 |
Lok Sabha Elections 2024: అక్కడ మూడోవిడత పోలింగ్‌ను బహిష్కరించిన ఓటర్లు.. కారణం ఇదే..!
X

దిశ వెబ్ డెస్క్: నేడు 11 రాష్ట్రాల్లో మూడో విడత సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. 11 రాష్ట్రాల్లో జరుగుతున్న మూడో విడత సార్వత్రిక ఎన్నికల్లో 93 సీట్లకుగాను మొత్తం 1351 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద వాతావరణం సందడి సందడిగా మారింది. అయితే యూపీలోని పలు గ్రామాల్లో మాత్రం ఎన్నికల వాతావరణం ఎక్కడ కనిపించడం లేదు.

దీనికి కారణం గత ఎన్నికల్లో ఓట్లు వేసి గెలిపించిన నాయకులు తమ సమస్యలను పరిష్కరించలేదని ఓటర్లు ఎన్నికలను బహిష్కరించారు. వివరాల్లోకి వెళ్తే.. బదౌన్‌లోని దోరణ్‌పూర్ ప్రజలు ఎన్నికలను బహిష్కరించారు. తమ గ్రామానికి రోడ్లు కూడా వేయలేదని, అలాంటప్పుడు తాము ఎందుకు ఓట్లు వేయాలని ప్రశ్నిస్తూ వాళ్ళు సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసేందుకు నిరాకరించారు. అలానే ఫిరోజాబాధ్‌లోని నాగ్లా జవహార్, నీమ్ ఖేరియా, నాగ్లా ఉమర్ గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.

Next Story