నిజాంసాగర్‌లో కుస్తీపోటీలు

by Sridhar Babu |
నిజాంసాగర్‌లో  కుస్తీపోటీలు
X

దిశ,నిజాంసాగర్‌ : నిజాంసాగర్‌ మండల కేంద్రంలో ఆదివారం గ్రామ శివారులోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయం వార్షికోత్సవంలో భాగంగా గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు కుస్తీపోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో మహారాష్ట్ర, కర్ణాటకతో పాటు పొరుగు జిల్లాల నుండి సైతం మల్లయోధులు తరలివచ్చారు. పోటీల్లో గెలుపొందిన మల్లయోధులకు ఆలయ కమిటీ, గ్రామపెద్దలు 2 వేల రూపాయలు నగదు అందజేశారు. ఈ కుస్తీ పోటీలు తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుండి సైతం ప్రజలు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు మల్లికార్జున్‌, పసుల రాములు, సత్యగౌడ్‌, రాము రాథోడ్, గాండ్ల రమేష్, నెల్లి కృష్ణమూర్తి, అయిటి రాజు, సందీప్‌కుమార్‌, లింగాగౌడ్‌, వడ్ల రాజు తదితరులు పాల్గొన్నారు.

Next Story