నీలం సంజీవరెడ్డి జయంతి సందర్భంగా ఆ ఫొటో షేర్ చేసిన RRR

by Mamatha |
నీలం సంజీవరెడ్డి జయంతి సందర్భంగా ఆ ఫొటో షేర్ చేసిన RRR
X

దిశ,వెబ్‌డెస్క్: నరసాపురం ఎంపీ, ఉండి అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి రఘురామకృష్ణరాజు సోషల్ మీడియాలో ఆసక్తికర ఫొటో పంచుకున్నారు. ఇవాళ (మే 19) భారత మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి జయంతి సందర్భంగా రఘురామ కృష్ణం రాజు ఆయనకు నివాళులు ఆర్పిస్తూ ట్వీట్ చేశారు. తాను యువకుడిగా ఉన్నప్పుడు నీలం సంజీవ రెడ్డిని కలిసి తీయించుకున్న ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ప్రజెంట్ ఆయన చేసిన ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. రఘురామకృష్ణరాజు ప్రస్తుతం నరసాపురం ఎంపీగా ఉన్నారు.

ఎన్నికల్లో ఉండి అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థిగా పోటీ చేశారు. శుక్రవారం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన పలు కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే దానిపై తన అంచనాలను మీడియాతో పంచుకున్నారు. ఈ ఎన్నికల్లో ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి రాబోతుందని ఆయన జోస్యం చెప్పారు. అంతేకాదు టీడీపీ కూటమికి 125 నుంచి 150 అసెంబ్లీ సీట్లు వస్తాయని ఆయన పేర్కొన్నారు. అటు వైసీపీకి కేవలం 40 సీట్లు మాత్రమే వచ్చే అవకాశముందన్నారు. ఏపీకి మంచి జరగాలని, అదేవిధంగా ఏపీకి చంద్రబాబు సీఎం కావాలని తాను తిరుమల శ్రీవారికి మొక్కుకున్నట్లు ఆయన చెప్పిన విషయం తెలిసిందే.

Next Story