- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
MP ఎన్నికల వేళ రేవంత్ రెడ్డి సర్కారుకు భారీ ఎదురుదెబ్బ..
లోక్‌సభ ఎన్నికల వేళ రేవంత్ సర్కార్‌కు బిగ్ షాక్ తగిలింది.

దిశ, వెబ్‌డెస్క్: లోక్‌సభ ఎన్నికల వేళ రేవంత్ సర్కార్‌కు బిగ్ షాక్ తగిలింది. తెలంగాణలో రైతు భరోసా పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. మే 13న పోలింగ్ ముగిసిన తరువాతే పెండింగ్‌లో ఉన్న రైతు భరోసా నిధులు పంపిణీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి కోడ్ ఉల్లంఘించారని సీఈసీ ఆక్షేపించింది. ఈ నెల మే 9లోగా రైతు భరోసా నిధులు పంపిణీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడాన్ని ఈసీ తప్పుబట్టింది. గత గణాంకాల ప్రకారం రబీ నిధులు జనవరి నాటికే రైతుల ఖాతాలో జమ చేయాల్సి ఉందని ఈసీ తెలిపింది.
కాగా, పంట పెట్టుబడి సాయం కింద రైతులకు అందించే రైతు భరోసా (రైతుబంధు) నిధులను విడుదలకు వ్యవసాయ శాఖ సన్నద్ధమైంది. ఇప్పటి వరకు ఐదు ఎకరాలలోపు వారికి నిధులు విడుదల చేసిన సర్కార్.. ఐదు ఎకరాలు పైబడిన రైతులకు ఫండ్స్ రిలీజ్ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం దాదాపు రూ.2000 కోట్ల నిధులను విడుదల చేసింది. అయితే, రేవంత్ రెడ్డి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారనే కారణంగా తాజాగా ఈసీ మే 13న పోలింగ్ ముగిసిన తరువాతే పెండింగ్‌లో ఉన్న రైతు భరోసా నిధులను పంపిణీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.






